New Delhi July 25 : అదనంగా పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులకు మరియు అధీకృత వేలం ప్లాట్ ఫారాలపై కొనుగోలు చేయటానికి వ్యాపారస్థులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ శ్రీ సునిల్ బర్త్వల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇది రైతుల విజయం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు ప్రకటన ద్వారా తెలియజేసారు. మరియు సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ శ్రీ సునిల్ బర్త్వల్ గారికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసారు.
అంతకు ముందు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి ఈ నెల 3వ తేదీన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీసుకెళ్ళారు. రైతులకు మేలు చేసే జీవోను విడుదల కావడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేసారు.
ఈ నెల 10వ తేదీన దేవరపల్లిలో జరిగిన పొగాకు TII రైతు అవార్డుల వేడుకలో ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపీ దృష్టికి పొగాకు రైతులు మిచాంగ్ తుఫాన్ వల్ల పంట కోల్పోయి తీరిగి ప్రభుత్వం అనుమతించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించామని, అదనంగా పండించిన పంటకు ఫెనాల్టీ లేకుండా కొనుగోలు చేయాలని ఎంపీ గారిని రైతులు కోరారు. వెంటనే స్పందించిన పుట్టా మహేష్ కుమార్ సంబంధిత మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్ళి ఎటువంటి అపరాధ రుసుం [ఫెనాల్టీ] లేకుండా అధీకృత ప్లాట్ ఫారాలపై పొగాకు అమ్ముకోవటానికి అనుమతులు కోరిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం జిఓ విడుదల చేసారు అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్. తెలియజేసారు. ఒక లైసెన్స్ ఉన్న రైతు 35 క్వింటాల్ పొగాకు పండించుకునే కోట కూడా 41.25 క్వింటాలకు పెంచారు అని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు తెలియజేసారు. మరియు త్వరలోనే పామాయిల్ రైతుల సమస్యలు కూడ పరిష్కరిస్తామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in