No Drugs:ఏలూరు, ఆగస్టు, 12…. మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలను తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నషాముక్త్ భారత్ అభియాన్(ఎన్ఎంబిఎ) కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఇటువంటి రుగ్మతలను రూపుమాపేందకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అన్నారు. మాదకద్రవ్యాల దుష్ర్పభావలపై పాఠశాల , కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక, అనారోగ్యాలు తలెత్తుతాయని అందుకే దేశ భవిష్యత్తును కుంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే ఎన్ పి డిఎస్ యాక్ట్ లో పేరు నమోదైత్ సొసైటీలో ఉనికి కోల్పోతారన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, కె. భాస్కర్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి రాకడ మణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in