పేద వారికి సామాజిక భద్రత కోసం ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ లు…
జూలై 01 నుండి న రూ.4,000/- పెన్షన్ . . . ఏప్రిల్ మే జూన్ అరియర్స్ తో రూ.7,000/- అందజేత…
గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తో లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ ల పంపిణీ…
జిల్లాలో 2,68,353 మందికి రూ.182.73 కోట్లు పెన్షన్ పంపిణీ…
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.





పెన్షన్ ల పెంపు పై ముఖ్యమంత్రి తొలి సంతకం . .
ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ లతో ప్రతి పేద వారి ఇంట్లో పండుగ వాతావరణం…
పేదరిక నిర్మూలన ప్రభుత్వం ప్రధాన అజెండా . . పేద వారికి వెన్నుదన్నుగా ప్రభుత్వం…
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధ కృష్ణ (చంటి)
ఏలూరు,జూలై 1: ఏలూరు జిల్లాలో 2,68,353 మందికి రూ.182.73 కోట్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి తెలిపారు. సోమవారం ఏలూరు గన్ బజార్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధ కృష్ణ (చంటి )తో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవ్వా,తాతలకు జూలై నెల పెన్షన్ రూ.4,000/- ను ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ రూ.3,000/- తో కలిపి మొత్తం రూ.7,000/- ను కలెక్టర్, ఎం ఎల్ ఏ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు పేద వారికి సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ల పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎన్.టి.ఆర్ భరోసా ద్వారా జూలై 01 నుండి పెంచిన పెన్షన్ ల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే మొదటి రోజే పూర్తి స్థాయిలో పెన్షన్ ల పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు. జిల్లాలో వివిధ క్యాటగిరీల క్రింద 2,68,353 మందికి రూ.182.73 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ ల విధానంలో శ్రద్ధ చూపడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు వారి సామాజిక అవసరాలు, మందుల కొనుగోలు వంటి వాటికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధ కృష్ణ (చంటి)మాట్లాడుతూ ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సామాజిక భద్రత పెంపు పై సంతకం చేశారని, ఈ సంతకంతో ప్రతి పేద వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పెంచిన పెన్షన్ లను పంపిణీ చేయడం జరుగుతున్నదని, ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1న ఉదయం 6గం.ల నుండి ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ సాయంత్రంలోపు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హామీ మేరకు అవ్వాతాతలకు ఇది వరకు అందిస్తున్న రూ.3,000/-లు ఉన్న పెన్షన్ ఒకేసారి రూ.4,000కు, వికలాంగుల పెన్షన్ ను రూ.6,000/- కు, పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్న వారికి రూ. 10,000/-, దీర్ఘకాళిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.15,000/-లు ఇలా క్యాటగిరీల వారీగా పెంచిన పెన్షన్ ను అందించడం జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వం ప్రధాన అజెండా అని, పేదవారికి వెన్నుదన్నుగా వారి కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. ముఖ్యమంత్రి పేద వారి తోడుగా, అంకితభావంతో పని చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీకి పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు మరియు అధికార యంత్రాంగానికి తన అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో డి అర్ డి ఎ పిడి డా. ఆర్.విజయారాజు,స్థానిక టిడిపి, జనసేన నాయకులు మధ్యాహ్నపు బలరామ్ ,రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in