NuzvidNuzvid
0 0
Read Time:7 Minute, 16 Second

Nuzvid: జులై, 10 : ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రజల పాలిట వరమని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీపై ప్రజల అవగాహనకు ఇసుకతో నిండిన ట్రాక్టర్ ను బుధవారం మంత్రి కొలుసు పార్థసారధి డ్రైవ్ చేస్తూ నూజివీడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు పట్టణంలోని ప్రధాన వీధులలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలందరి శ్రేయస్సే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీతో రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్దిపదాన పయనిస్తున్నదన్నారు. నిర్మాణ రంగ కూలీలకు చక్కని ఉపాధి లభిస్తున్నదని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 సంతకాలతో రాష్ట్ర ఉజ్జ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 16 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేశారన్నారు. డిగ్రీ చదువే కాదు యువతకు వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని కల్పించడం ద్వారా మెరుగైన ఉద్యోగకావకాశాలు పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ పై రెండవ సంతకం చేసారని, స్కిల్ డెవలప్మెంట్ కు కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడం జరుగుతుందన్నారు. పేదవారి పాలిట శాపంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుపై మూడవ సంతకం చేశారన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి అందిస్తున్నామన్నారు. సామజిక పెన్షన్లు 4 వేల రూపాయలు పెంచుతూ, గత మూడు నెలల పెంచిన సొమ్మును అందిస్తూ సంతకం చేశారన్నారు. పేదల ఆకలి తీర్చే అన్నా కాంటిన్ల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి 5వ సంతకం చేశారన్నారు.
ఉచిత ఇసుక విధానం పై ట్రాక్టర్లతో భారీ ర్యాలీతో ట్రాక్టర్ నడిపిన మంత్రివర్యులు కొలుసు పార్థసారథి
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ఇవ్వని వాగ్దానాలు సహితం నెరవేర్చడం తో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఉచిత ఇసుక విధానం పై అన్ని వర్గాల ప్రజలు తమ హర్సాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రివర్యులు అన్నారు గతప్రభుత్వము ఇసుకవిధానం పై తీసుకొన్న నిర్ణయంపై భవనిర్మాణ కార్మికులు పేద ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఇబ్బందులకు గురైనట్లు గుర్తించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఉచిత ఇసుక ఉదానం తీసుకొచ్చారని ఈ విధానం పై అన్ని వర్గాల ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రతి పేదవాడికి తెలియజేయాలని ప్రతి ఇంటి ముంగిటికి చేరవేయవలసిన బాధ్యత మన కార్య కర్తలు నాయకుల పై ఉందని అన్నారు ఈ విధానంపై ప్రజలకు ఆవగాహన చైతన్యం తీసుకొని రావాలని నాయకులకు మంత్రివర్యులు పిలుపునిచ్చారు నాణ్యమైన ఉచిత ఇసుక అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు ఈ ఉచిత ఇసుకవిధానంలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిరంతరం కలెక్టర్ మరియు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. ఇసుక రవాణా లో ఎటువంటి అవకతవకలు జరిగిన నా దృష్టికి తీసుకొని వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసారు అంతే కాకుండా పేదవాడికి అన్ని విధాలుగా అండ దండలుగా ఉంటామని తెలియజేసారు గత గత ప్రభుత్వంలో ఇసుక దందా పెద్ద ఎత్తున జరిగిందని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వ విధానం పై భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడిపారని ఇకనుండి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన ప్రభుత్వం మా ప్రభుత్వం అన్నారు నూజివీడు పట్టణాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానాని హామీ ఇస్తున్నా అలాగే నూజివీడు లో ఒక సుందరమైన పార్కును నిర్మాస్తానని తెలిపారు నూజివీడు మామిడికి మరలా పూర్వ వైభవం తీసుకొచ్చి నూజివీడు పట్టణ ప్రగతిని ప్రపంచ పటంలో నిలబడతానాని తెలిపారు నూజివీడు నియోజకవర్గ ప్రజలకు ఒక పెద్దపలేరులా పనిచేస్థానని అన్నారు మాది చేతల ప్రభుత్వం అని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు మా కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు నాయకులకు నాకు ఇంతటి విజయం చేకూర్చిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం వందనం తెలియజేస్తున్న అని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు .

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *