Nuzvid:ఏలూరు,జూలై 19:రెండు రోజులనుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్సాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు పాటించాలని మంత్రివర్యులు కొలుసు పార్థసారధి ప్రజలకు విజ్ణప్తి చేశారు.
నూజివీడు నియోజక వర్గ ప్రజలకు భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే మా కార్యదర్శి దృష్టికి తెలియజేయాలని సూచించారు.తెలియజేసిన మరుక్షణమే సంబంధింత అధికారులను అదేశించి తక్షణ చర్యలు చేపడతామన్నారు .వరదల సమయంలో ముఖ్యంగా కలుషిత నీరు త్రాగడం ద్వారా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉందనీ,కాచి చల్లార్చిన నేరు త్రాగడం మంచిదన్నారు.
విద్యుత్ స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం ,భారీ చెట్లు విరగడంతో రవాణా అంతరాయం కలగడం ప్రమాదాలు జరగడం మరియు విషసర్పాలు ఇళ్లలో ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఆహార కొరత ఉన్న మరియు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన ఎటువంటి ప్రమాదం ఎదురైన వెంటనే మంత్రివర్యుల కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని ,24 గంటలు మా సిబ్బంది మంత్రివర్యుల క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ,వారియొక్క సేవలు వినియోగించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు మంత్రివర్యులు సూచించారు. వరదలకు సంబంధించిన పలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రభుత్వ శాఖల ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు .ప్రభుత్వ అధికారుల్లో ముఖ్యంగా వైద్య, రెవెన్యూ, విద్యుత్, రవాణా శాఖ, ఆహార భద్రత, ఎన్ డి అర్ ఎఫ్, శాఖల కు సంబంధించి అధికారులందరూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఏ విధమైన ఇబ్బందులకు గురికాకుండా కాపాడడానికి సంసిద్దంగా ఉన్నారన్నారు. నియోజక ప్రజలు ,జిల్లా ప్రజానీకం ఆదర్య పడకుండా వారి సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేసారు.
24 గంటలు అందుబాటులో మంత్రివర్యుల కార్యదర్శి కాల్ చేయవలసిన నెంబర్: 8522007645,
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in