Nuzvid:జూలై, 20… భారీ వర్షాల నేపద్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఆదేశించారు.
భారీ వర్షా కారణంగా నియోజకవర్గంలో ముంపుకు గురైన ప్రాంతాల వివరాలు చేపడుతున్న చర్యలపై ప్రభుత్వ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి సమీక్షించారు. ఈ సమీక్షలో పాల్గొన్న రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకరి ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీరు సత్యనారాయణ లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ ముసునూరు, చాట్రాయి నూజివీడు మండలాల పరిధిలోని వాగులు, పంట కాలువల పరిస్థితిపై ఆరాతీశారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఎంతమేరకు ఉండవచ్చునని అధికారులనుండి సమాచారం తెలుసుకున్నారు. రోడ్ల పై భారీ వృక్షాలు విరిగి పడి ఉండటం గమనించిన మంత్రివర్యులు అవి వెంటనే తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే భారీ వర్షాలు కారణంగా కలుషిత నీటి ద్వారా ముఖ్యంగా అతిసార వ్యాధి సోకుతుందని మరియు డెంగ్యూ మలేరియా జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తూ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపి జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ముందస్తుగా మందుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కారణంగా విద్యుత్ స్తంభాలు అకస్మాత్తుగా పడటం వలన విద్యుత్ వైర్లు తెగి పడటంతో ప్రాణనష్టం ఎక్కువ ఉంటుందని వాటి బారిన పడకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను కాపాడడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే భారీ వర్షాల వలన పశువుల ప్రాణనష్టం కలుగకుండా నివారించుటకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు తెలిపారు ముఖ్యంగా వర్షాల ద్వారా గొర్రెలు, మేకలు, బర్రెలు, అనేక రోగాలకు గురవుతాయని వాటిని నివారించడానికగి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని రైతులను కాపాడాలని మంత్రివర్యులు అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ వర్షాన్ని తట్టుకొనే శక్తి మన చెరువులకు ఉందా అని ప్రశ్నించగా ఇంకా రెండు రోజులు కురిసినా వర్షాన్ని తట్టుకునే సామర్థ్యం మన నియోజకవర్గములో ఉన్న చెరువులకు ఉందని తెలియజేస్తూ 4 రోజుల వర్షాల వల్ల పూర్తిగా చెరువులు నిండుతాయని సంబంధిత అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులు స్పందిస్తూ ప్రస్తుతానికి ఎటువంటి ఆస్తి నష్టం, పంట నష్టం గాని జరగలేదని తెలియజేస్తూ రానున్న రెండు రోజుల్లో కూడా ఎటువంటి నష్టం కాని ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కలుగకుండా ముందస్తు చర్యలు చేపడతామని అధికారులు మంత్రివర్యులకు తెలియజేసారు. దీనిపై రాష్ట్ర మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తమకు తెలియజేయాలని దానిని బట్టి తక్షణ చర్యలు చేపడతామన్నారు
సమీక్షా సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వై. భవాని శంకరి, ఇరిగేషన్ డివిజనల్ అధికారి సత్యనారాయణ, అగ్రికల్టర్ అధికారులు, విద్యుత్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు,
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in