Nuzvid August 2 : రాష్ట్రంలోని 2. 50 లక్షల మంది కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు అందిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
నూజివీడు లోని మడుపల్లి తాతయ్య బాబు (M.T College) జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు విద్యా కానుక కింద పాఠ్య, నోట్ పుస్తకాలను మంత్రి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదన్నది ముఖ్యమంత్రి ఆశయమని, అందుకే విద్యాభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా అందించలేదని, విద్యా మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా శాఖ సమీక్షలో అధికారులు ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే కళాశాల విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా అందించాలని ఆదేశించారని, 10 రోజులలోగా మంత్రి ఆదేశాలను అమలు చేసి, రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి అంతా రాష్ట్రాభివృద్ధి పైనే ఉందన్నారు. యువత ఉజ్జ్వల భవిష్యత్తు గురించి వారి తల్లితండ్రుల తరవాత అంతగా ఆలోచించేది విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అని, చదువుకున్న యువతకు మెరుగైన రీతిలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో నేటి యువత బాగా విద్యను అభ్యసించి వృద్ధిలోకి రావాలన్నారు.
కార్యక్రమంలో ఆర్ ఐ ఓ ప్రభాకర్, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in