Nuzvid August 2: ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థినీ విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నాసిరకం భోజనం అందిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి అధికారులను హెచ్చరించారు. నూజివీడు పట్టణంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహాన్ని మంత్రి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే ప్రదేశాలు, టాయిలెట్స్, బాలికల విశ్రాంతి గదులను పరిశీలించారు.
వసతి గృహం ఆవరణంలో పారిశుద్ధ్యాన్ని , పరిసరాల ప్రాంతమంతా క్షున్నంగా పరిశీలించారు. బాలికలను ఒక్కొక్కరిని పలకరిస్తూ యోగ క్షేమాలు, వసతి గృహంలో వసతుల వివరాలు సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలికలు త్రాగునీరు,టాయిలెట్స్ శుభ్రత, బెడ్రూంస్ లో బెడ్స్ , విద్యుత్ సమస్య, భోజనాల సమస్యలను సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు మెనూను వసతి గృహాలలో తప్పనిసరిగా పాటించాలని, తాను మళ్ళీ ఆకస్మిక తనిఖీకి వస్తానని అప్పుడు కూడా ఇటువంటి ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని మంత్రి హెచ్చరించారు. బాలికలకు కావలసిన ముఖ్యమైన వసతులు ఫ్యాన్లు తక్షణమే ఈ రోజే బిగించమని అధికారులకు చూసించారు త్వరలో బెడ్స్, టాయిలెట్స్, వంటశాల, త్రాగునీరు, శానిటేషన్, బిల్డింగ్కు రంగులు, హాస్టల్ ఆవరణంలో ఆహ్లాద కరమైన గార్డెన్, మరియు త్రాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు పూర్తి చేస్తామని బాలికలకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. సాంఘిక సంక్షేమ అధికారిని మాట్లాడుతూ ఈ హాస్టల్లో సుమారు 190 మంది బాలికలు ఉంటున్నారని ఇంకా కొన్ని టాయిలెట్స్ అవసరం అని మంత్రివర్యుల దృష్టికి తీసుకొని రాగ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. . మంత్రి వెంట సాంఘిక సంక్షేమ అధికారిణి నాగమణి సిబ్బంది విద్యార్థులు ఉన్నారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in