Nuzvid July 11: పేద ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. గురువారం నూజివీడు రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ఆయన ప్రారంభించారు.
షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 282 ప్రత్యేక కౌంటర్ల్ల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం,కందిపప్పు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైందనీ, ఇక నుండి ప్రతి ఒక్కరికీ మేలు జరగబోతోందనీ మంత్రి పార్థసారధి భరోసా ఇచ్చారు. ప్రత్యేక కౌంటర్లో కందిపప్పు (దేశవాళీ వెరైటీ )కేజీ రూ.160 (బహిరంగ మార్కెట్ ధర కేజీ రూ.181 )బిపిటి/సోనా మసూరి –ఫైన్ రైసు (స్టీము) కేజీ రూ.49 (బహిరంగ మార్కెట్ ధర .55.85 పై), బిపిటి/ సోనా మసూరి –ఫైన్ రైసు (రారైసు) కేజీ రూ.48 (బహిరంగ మార్కెట్ ధర.52.40 పై.) ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. గత 6 నెలలనుండి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని దాన్ని అరికట్టి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే సరుకులు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆలోచించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన తదనంతరం రైతు బజారుల్లో ఈ ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రివర్యులు తెలిపారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డివో వై. భవానీశంకరి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.రాజు, స్ధానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in