Nuzvid July 11:నూజివీడు రైతుబజారు నందు గల దుకాణాలను గురువారం రాష్ట్ర మంత్రి పార్ధసారధి పరిశీలించి దుకాణదారుల ఇబ్బందులను అడిగి స్వయంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.

దుకాణ యజమానులు మంత్రివర్యుల దృష్ఠికి తీసుకొచ్చిన సమస్యల్లో ముఖ్యంగా శానిటేషన్ శుభ్రంగా లేదని, రేకు షెడ్లు పాడైపోయి వర్షం కురిసి ఇబ్బంది పడుతున్నామని మరియు అద్దెలు కొంచెం తగ్గించాలని, టాయిలెట్స్ నిర్మించాలని కోరగా మంత్రివర్యులు వెంటనే స్పందించి త్వరితగతిన సంబంధిత సమస్యలను పరిష్కరంచాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు. రానున్న 6 మాసాల్లో మొత్తం ఇబ్బందులన్ని తొలగించి అదునాతనమైన రైతు బజారు ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామన్నారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డివో వై. భవానీశంకరి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.రాజు, స్ధానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in