Oil Reusing:కాచిన నూనె మళ్ళీ వాడుతున్నారా పూరి, గారెలు వంటి వాటికి ఎక్కువ మొత్తంలో నూనె వాడుతుంటాం. చేయడం పూర్తయ్యాక దాన్ని తిరిగి వేరే వంటలకు ఉపయోగిస్తుంటాం.
కానీ అది కొన్నిసార్లు రక్తపోటుకు కారణం అయితే ఇంకొన్నిసార్లు ఆహారాన్ని విషపూరితము చేయచ్చని తెలుసా. అలా కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్త చేయాలన్న తొందర వద్దు. ముందు చల్లారనివ్వండి .అంతకుముందు వేయించిన పదార్థాలు ఉండిపోతే అవి నూనెని విషతుల్యం చేస్తాయి.
కాబట్టి వస్త్రంతో వడపోయాలి. ఆ పైనే వేరే వాటికి వినియోగించుకోండి. కాగిన నూనెకు మొక్కజొన్న పొడి నీ కలిపి తక్కువ మంట మీద వేడి చేయండి.
మరగకుండా గరిటతో కలుపుతూ పిండి కాస్త గట్టిపడేటట్లు అనిపించాక దింపి వడకట్టేస్తే సరి. చిన్న మంట మీద నూనెను వేడి చేస్తూ నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసి అందులో వేయండి.
నూనెలో మిగిలిపోయే అవన్నీ ఆ ముక్కలకు అంటుకుంటే ఆపై నూనెను వడకట్టుకుంటే సరిపోతుంది. సరిగ్గా భద్రపరచకపోయినా కాగిన నూనె విషపూరితమవుతుంది. వేడిమీకి దూరంగా ఉంచాలి. స్టవ్ కి దగ్గరగా ఉంచకూడదు. బదులుగా ఫ్రిజ్లో ఉంచడం మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in