పాలకొల్లు: 01.07.2024. పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణంలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.
లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు .
తెల్లవారుతుండగానే పింఛన్ల పంపిణీకి కదిలిన జిల్లా అధికార యంత్రాంగం.. ప్రజాప్రతినిధులు
ప్రతి ఇంటికి వెళ్లి అవ్వా ఇదిగో పింఛన్ డబ్బులు రూ. 7వేలు…. తాతా ఇదిగో రూ. 7వేలు… అంటూ అధికారులు అందిస్తున్న వేళ….అవధులు లేని అవ్వాతాతల ఆనందం ….
పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం రూ. 7వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జేజేలు పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతున్న పింఛన్ లబ్ధిదారులు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in