palakoderupalakoderu
0 0
Read Time:5 Minute, 57 Second

Palakoderu: జూలై 15, 2024 మహిళలు ఆర్థిక ఎదుగుదల వారి కుటుంబంతో పాటు, దేశ ప్రగతికి ప్రయోజనంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం పాలకోడేరు మండల సమైక్య భవన్ నందు 20 మండలాల సమైక్య అధ్యక్షులు, ఏపీఎంలు, డిపిఏంలుతో ఏర్పాటుచేసిన జిల్లా సమైక్య సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అల్పాదాయ వర్గాల మహిళలు తప్పకుండా గ్రూపులో చేరేందుకు అవకాశాలు కల్పించాలని తెలిపారు. నూరు శాతం రుణాలు రికవరీ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మహిళ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ద్వారా మేలైన పంటలను పండించి అధిక లాభాలను పొందవచ్చు అన్నారు. ప్రతి మండలంలో వనరులు ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలలో సంఘాలు పాల్గొవాలని, కొబ్బరి అందుబాటులో ఉన్న చోట కొబ్బరి ఆధారిత కార్యక్రమాలు, మత్సకార ఏరియాలో మత్స అదారిత కార్యక్రమాలు, కూరగాయలు పెంపకం, నర్సరీల పెంపకం, మొదలగు జీవనోపాధి కార్యక్రమంలో మహిళా సంఘాలు చురుకుగా పాల్గొనాలన్నారు. మహిళలు వారికి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, సబ్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసుకొని జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలన్నారు. యలమంచిలి, మొగల్తూరు, నరసాపురం, పెంటపాడు, తాడేపల్లిగూడెంలలో డైరీ యూనిట్స్ ను పెద్ద మొత్తంలో గ్రౌండ్ చెసి, పాల మార్కెటింగ్ ను పెంపొందించుకోవాలన్నారు. నరసాపురం, తణుకు పట్టణాల్లో లాభాల బాటలో కొనసాగుతున్న మహిళా మార్ట్ ల మాదిరిగా పాలకోడేరు, అత్తిలి, ఉండి లలో కూడా ఏర్పాటు చేచేందుకు ముందుకు రావాలని కోరారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని మత్స్యకార మహిళ సభ్యులు పరిశుభ్రమైన వాతావరణంలో సోలార్ టెక్నాలజీ ద్వారా డ్రైఫిష్ ను తయారు చేసి ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనత వంటి విషయాలు పైన అవగాహన కల్గి ఉండాలని, బాల్య వివాహలు జరగకుండా తల్లి తండ్రులు కి అవగాహన కల్పించాలని తెలియచేసారు. బడి ఈడు పిల్లలు బడిలో మాత్రమే ఉండాలని, ఇందుకు తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి మండల సమైక్య పీ ఎం ఇ జి పి, పీఎంఎఫ్ఎంఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ తణుకులో ఏర్పాటుచేసిన అన్న సంజీవిని (జనరిక్ మెడిసిన్స్) షాపు సుమారు 5 లక్షల రూపాయల టర్నోవర్ తో నెలకు 50 వేల రూపాయల నికర ఆదాయాన్ని సాధిస్తుందన్నారు. అత్తిలి మండలం మంచిలిలో మహిళా సమైక్య సభ్యులు పరిశుభ్రమైన వాతావరణంలో పూతరేకులు, సోంపాపిడి, చిక్కీలు తయారు చేసే మార్కెటింగ్ ద్వారా అధిక లాభాలు పొందుతున్నారన్నారు. సాంఘికంగా ఎదిగేందుకు పలు సూచనలు చేశారు. ఏ మండలం లో ఏయే జీవనోపాధి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందో యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలుకు కృషి చేస్తామని డిఆర్డిఏ పిడి కలెక్టర్ కు తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్డిఏ డిపిఎంలు డి.వెంకటేశ్వరారావు, కె.శ్రీనివాస్, ఎస్. కుసుమ కుమారి, ఎం.శ్రీనివాస్ ప్రసాద్, బి.రామకృష్ణ, SVEP- భీమవరం టి.మురళి కృష్ణ, ఏపీవో పెన్షన్ లు టి.బాలకోటయ్య, fpo ఏపిఎం యు.రవికుమార్, జెండర్ ఏపీఎంలు పి.శ్రీరామ్, నాగేంద్ర, స్త్రీనిధి మేనేజర్లు, జిల్లా సమైక్య అధ్యక్షులు పీ.అరుణ కుమారి, వైస్ ప్రెసిడెంట్ డి.ప్రవీణ, సెక్రటరీ ఓ.కమల, జాయింట్ సెక్రటరీ డి.ఆదిలక్ష్మి, మండల సమాఖ్య ప్రెసిడెంట్ లు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ లు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *