Pasupu Kumkuma:పసుపు కుంకుమ పొరపాటున భూమిపై పడితే అశుభమా తెలిసి తెలియకుండా పూజ చేసేటప్పుడు చెయ్యి జారి పసుపు, కుంకుమ భూమిపై పడుతుంది.
వెంటనే ఏం ఆలోచిస్తామో అంటే అయ్యో నా మాంగల్యానికి ఏమవుతుందో అని, భర్తకు ఏమైనా ఆపద జరుగుతుందా అని, ఏదైనా కీడు జరుగుతుందో ఏమో అని చాలా భయపడుతూ ఉంటారు.
ఈ విషయంలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు.భూమాత కూడా అమ్మే తను ఒక స్త్రీనే.భూమాత కి పసుపు, కుంకుమ అంటే చాలా ఇష్టం.
భూమాతకి పసుపు, కుంకుమ కావలసినప్పుడు తీసుకుంటే మరి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు.
ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు భూమాత కి కూడా పృద్వి పూజ చేయాలి.
భూమాత కి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, గంధం సమర్పించి నమస్కారం చేసుకోవాలి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in