Penugonda:జూన్ 30,2024. విద్యార్థులు మంచి వాతావరణంలో చదువుకునేలా పరిసరాలను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు సి.నాగరాణి తెలిపారు …
ఆదివారం పెనుగొండలోని డాక్టరు బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టరు సి నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి,వసతి గృహాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్ధినులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతి పై ఆరా తీశారు.విద్యార్ధినులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టరు సమాధానాలను రాబట్టారు. విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని ఉద్బోధించారు.అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువులో కూడా మరింత రాణించగలరని అన్నారు. చదువుతోపాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వసతి గృహంలో ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని విద్యార్థిలను అడగగా త్రాగునీటి సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుంటానని తెలిపారు.ప్రస్తుతం గృహాం నందు 323 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని, ఈ వసతి గృహం నందు ఐదవ నుండి పదవ తరగతి వరకు విద్యార్థినులకు వసతి కల్పించడం జరుగుతుందని,450 మంది వరకు కెపాసిటీ ఉందని, అడ్మిషన్ జరుగుతున్నాయని వసతి గృహా ఉపాధ్యాయులు జిల్లా కలెక్టరుకు తెలిపారు. 2+2 మహిళా సెక్యూరిటీ సిబ్బందిని 24 గంటలు గృహం నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వసతి గృహం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ వసతి గృహ నిర్వాహకులకు హలో సూచనలు చేశారు. వసతి గృహం నందు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టి తీసుకురావాలని విద్యార్థినులకు జిల్లా కలెక్టరు సి.నాగరాణి తెలిపారు.
గురుకుల పాఠశాల తనఖీ సందర్భంలో ఉపాధ్యాయులు పి.జయశ్రీ, వందన, ధర్మాని, విద్యార్థినులు, తదితర సిబ్బంది ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in