Phool makhana:పాయసం ఆరోగ్యం మరియు రుచి కలిగిన అద్భుతమైన పాయసం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాయసాన్ని రోజు టీ లేదా కాఫీలకు బదులు గా దీనిని ఒక కప్పు త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Is sweet makhana good for health?
దీనితో పాటు పోషకాలు అందించి, బలంగా మనల్ని మార్చుతుంది. పొట్టకి హాయినిస్తుంది. స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ పాయసం తాగితే మంచిది.
Shahi Makhana Kheer
దీనిలో మనం బెల్లం, పాలు, సగ్గుబియ్యం, phool ma khana వంటి వాటితో చేయడం వల్ల ఐరన్ ,మెగ్నీషియం,కాల్షియంతో పాటు అనేక పోషకాలు కూడా ఉంటాయి.
ముందుగా ఈ పాయసం చేయడానికి అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక గంట సేపు నానబెట్టండి. చిన్న సగ్గుబియ్యం కాకుండా పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది.
ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం మెత్తగా ఐతై పాయసం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. త్వరగా ఉడుకుతుంది.
తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి గిన్నెలోకి అరకప్పు బెల్లాన్ని తీసుకొని ఇందులోని పావుకప్పు వాటర్ ని వేసి పాకం అయ్యేంతవరకు కలుపుతూ ఉండండి.
తరువాత స్టవ్ కట్టేయండి. ఇలా ముందుగానే పాకం చేసుకోవడం వల్ల పాయసం చేసేటప్పుడు పాలు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వెయ్యండి.
నెయ్యి వేడి అయిన తరువాత ఒక కప్పు వరకు phool ma khana ను వేసి బాగా ఫ్రై చేసుకోండి. దీనిని తామర గింజల నుంచి తీస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
బరువు తగ్గాలి అనుకున్నా వారికి, డయాబెటిస్ ఉన్నవారికి, హార్మోన్ ఇన్ బాలన్స్ ఉన్నవారికి ,హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారికి బాగా పని చేస్తుంది.
ఇలా బాగా ఫ్రై అయిన తరువాత ఈ phool ma khana ను ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత ఆ కడాయిలో ముప్పావు లీటర్ పాలను తీసుకొని మరిగించండి. పొంగు వచ్చిన తరువాత దానిలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వెయ్యండి.
సగ్గుబియ్యం ఉడికిన తరువాత వేయించిన phool ma khana ను వేసి ఉడకనివ్వండి phool makhana ఉడికిన తరువాత స్టవ్ కట్టేసి దానిని మనం తయారు చేసిన బెల్లం పాకాన్ని వేసి బాగా కలపండి.
ఇలా స్టవ్ కట్టేసి బెల్లం పాకం వేయడం వల్ల పాలు అనేవి విరగవు. తరువాత వేరొక స్టవ్ పై గిన్నెను పెట్టి అందులో మూడు స్పూన్ల నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, కిస్ మిస్, తురిమిన బాదంపప్పు వేసి వేయించండి.
ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ ని పాయసంలో వేయండి.అంతే వేడి వేడి phool ma khana పాయసం రెడీ అయినట్టే.ఈ పాయసాన్ని రోజు త్రాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in