Pineapple Health Benefits:అనాసతో అందం ఆరోగ్యం కొంతమంది అనాస పండును తొక్క తీసేసి నేరుగా తినడానికి ఇష్టపడితే, మరి కొందరు జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే ప్రత్యేకించి వేసవిలో దీనివల్ల ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
చర్మం మెరిసేలా: meis మరియు అమోనో యాసిడ్ చర్మంలో కొలెజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి దాని ద్వారా చర్మం బిగుతుగా పట్టుత్వం కోల్పోకుండా చేస్తాయి.
అలాగే చర్మంపై పేర్కొన్న మృత కణాలను తొలగించి కాంతివంతంగా మారుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా క్రమంగా చర్మచాయిలో కలిసిపోతాయి.
ఫలితంగా ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
దీనికోసం తొక్క చెక్కిన పైనాపిల్ ముక్క ఒకటి తీసుకొని నేరుగా చర్మంపై రుద్దుకోవాలి. కాసేపు ఆరనిచ్చి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
జుట్టు రాలకుండా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బాధపడుతున్న సమస్య జుట్టు రాలడం, అనాసలు పుష్కలంగా ఉండే విటమిన్ సి జుట్టు రాలడం నివారించడంలో సమర్థంగా పనిచేస్తుంది.
అయితే ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్యాక్స్ జూసుల రూపంలో కాకుండా పైనాపిన్ని రోజు తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. అప్పుడే సత్ఫలితాలు ఆశించే అవకాశం ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు: అధికంగా అనాసలో విటమిన్ సి తో పాటు పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాదు చర్మ నవ యవ్వనంతో నిగనిగలాడేనా కూడా చేస్తాయి.
అదనపు ప్రయోజనాలు: అనాస గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ని కలిపి పెదాలకు రాసుకుంటే ఆధారాల్లో తేమ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ఫలితంగా పెదాలు పొడిబారక్కుండా ఉంటాయి. పెదాలపై ఉండే పగుళ్లు తగ్గడానికి కూడా పైనాపిల్ బాగా సహాయపడుతుంది. అనసులో ఉండే మాంగనీస్ శరీరంలో ఎముకల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా ఎముకలు బలంగా తయారవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ఎముకల సంబంధిత సమస్యలేవీ దరిచేరకుండా సంరక్షిస్తుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల నెలసరికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా పీరియడ్ సమయంలో బాగా నొప్పితో సతమతమయ్యే వారు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in