Plantation: మిషన్ శక్తి బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం క్రింద నూరు రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహణలో బాగంగా మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ , జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రసెల్వి మొక్కలను నాటారు. అదే విధంగా నషా ముక్త్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కూడా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జెసి పి. ధాత్రిరెడ్డి, పలువురు జిల్లా అధికారులు మొక్కలు నాటారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని, అందుకు ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్, కర్మాగారాల వ్యర్థాలు, హానికారక రసాయనాలు వినియోగం కారణంగా వాతావరణం, వాయువు, జల కాలుష్యాలకు గురి అవుతున్నాయన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే వాటిని వినియోగాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన నైతిక బాధ్యత ప్రతీ ఒకరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన కర్తవ్యం మొక్కలను పెంచడమేనని, ప్రతీ ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి రోజులలో విరివిగా మొక్కలను నాటే అభిరుచిని కలిగి ఉండాలన్నారు. మొక్కలను నాటడమే కాక వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రాకడ మణి , ట్రాన్స్కో ఎస్ఈ సాల్మాన్ రాజు, ఏపిఎంఐపి పీడీ రవికుమార్, డిసిహెచ్ ఎస్ డా.పాల్ సతీష్, ఎస్డీసీ లు ఎం. ముక్కంటి, కె. బాబ్జి, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. మాలతీ, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఘంటా సుధాకర్, పలువురు ఎక్సైజ్ పోలీసు అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in