Polavaram,జూలై 2:పోలవరం మండలం, పట్టిసీమ ఎత్తి పోతల పథకం నుండి జూలై 3వ తేదీ బుధవారం ఉదయం 7:27లకు గౌరవ జలవనరుల శాఖామాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిచే కాలువలకు సాగు నీరు విడుదల
చేయబడుచున్నదని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
ముందుగా 1000 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువ
ద్వారా సరఫరా చేయబడునని,తరువాత కృష్ణా డెల్టా అవసరాలకు అనుగుణంగా
8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయబడునన్నారు. కృష్ణా డెల్టా నందు 13.08 లక్షల
ఎకరాలకు ఈ నీరు సరఫరా చేయబడును. ఇదేవిధముగా తాడిపూడి,
పురుషోతపట్నం మరియు పుష్కర ఎత్తిపోతల పదకముల నుండి కూడా సాగునీరు
విడుదల చేయుదురన్నారు. ఈ సాగు నీటిని ప్రజలు అందరు సద్వినియోగం
చేసుకొనవలసినడదిగా చేసుకోవలసినదిగా తెలియజేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in