Police Dormitory:ఏలూరు,మార్చి,8: శాంతి భధ్రతల పరిరక్షణ, ప్రజా రక్షణకు రాత్రింబవళ్లు పనిచేసే పోలీస్ సేవలు అభినందనీయమని జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

శనివారం స్ధానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కృషితో మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణం కొరకు ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి కేటాయించిన రూ. 64.80 లక్షలతో నిర్మించనున్న మహిళా పోలీస్ డార్మెటరీ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్ధాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మహిళల బ్యారెక్స్ నిర్మాణం కొరకు తెలియజేసిన వెంటనే 24/7 ప్రజా రక్షణ కొరకు శ్రమిస్తున్న పోలీసులకు తన వంతు సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్ నుంచి 64 లక్షల 80 వేల రూపాయలను నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
పోలీసు వ్యవస్థకు మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఎంపీ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియ చేసినారు.
ఈ సందర్బంగా మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి నిధులు కేటాయించిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కు మహిళా పోలీసు సిబ్బంది, హోంగార్డులు తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి), నగర మేయర్ నూర్జాహాన్ పెదబాబు, ఆర్ టి సి రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్, ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి , అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆర్. ఐ పవన్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, పలువురు పోలీస్ ఆధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in