Power Cut:ఏలూరు, జూలై, 11…ది 12-07-2024 వ తేదిన ఏలూరు 1 వ పట్టణం లో గల కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిదిలో విద్యుత్ లైన్ల దగ్గరగా గల చెట్ల కొమ్మల తొలగింపు మరియు విద్యుత్ లైన్ల వార్షిక మరమత్తుల నిమిత్తం
ఉదయం 07:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జెపిబి నటరాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమయములో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి లో గల వైభవ్ పోర్ట్ ఏరియా, కాంగ్రెస్ ఆఫీస్ వీధి, వెన్నవల్లివారిపేట, నవాబ్ పేట, సత్యనారాయణ పేట, లంబాడి పేట, భావిశెట్టివారి నల్లదిబ్బ మరియు కెనాల్ రోడ్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు సహకరించవలసినదిగా ఆయన కోరారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in