Pregnancy Tips:
ప్రెగ్నెన్సీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
మాతృత్వం అనేది ఒక వరం. ప్రతి ఆడవారికి తల్లి అవడం అనేది ఒక కలగా ఉంటుంది. వారి జీవితంలో తన బేబీని మొట్టమొదటిసారి చేతుల్లో తీసుకున్న రోజు ఎప్పటికీ మరిచిపోలేరు.
అలాంటి మాతృత్వం కోసం ఆడవారు తహతలాడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ లో ఆడవారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనకు చాలా సందేహాలు వస్తాయి.
ఏం తినాలి, ఏం పని చెయ్యాలి ,ఎలా ఉండాలి అని చాలా సందేహాలు వస్తాయి. ఈ పని చేయకూడదు ఇది తినకూడదు అంటూ ఏమీ లేదు. పూర్వకాలంలో ఆడవారు నెలతప్పిన అన్ని పనులు చేసుకొని బలమైన తిండిని తింటూ నార్మల్ డెలివరీ అయ్యేవారు.
కానీ ఇప్పుడు మారిన కాలుష్య వాతావరణం మారిన ఫుడ్ వలన ఎవరికి నార్మల్ డెలివరీ అవ్వటం లేదు. ఇప్పుడు మారిన వాతావరణం బట్టి ప్రెగ్నెంట్ అయిన ఆడవారు మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఈ సమయంలో గర్భంలో ఉన్న పిండం చాలా సున్నితంగా ఇంకా మీ బేబీ ఎదుగుదల అప్పుడే మొదలవుతుంది కనుక మొదటి మూడు నెలలు ఎక్కువ పనులు అంటే బరువులు మోయకపోవడం, గబగబా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండడం ఎక్కువ జర్నీ చేయడం వంటివి మంచిది కాదు.
కొంతమందిలో ప్రెగ్నెంట్ అయినప్పటికీ లైట్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాంటివారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
అంతా నార్మల్ గా ఉన్నవారు చక్కగా పనులు చేసుకోవచ్చు. బయట తిండ్లు తినకపోవడం మంచిది. అలాగే పండ్ల రసాలు బేబీ గ్రోత్ ను పెంచే ఆహారం తీసుకోవడం మంచిది .
కొంతమందిలో ముందు మూడు నెలలు ఏమీ తినాలనిపించకపోవడం ,వాంతులు అవడం వాసనలు పడకపోవడం వికారంగా ఉండడం వంటివి ఉంటాయి.
ఎటువంటి సింటమ్స్ లేని వారు కూడా ఉంటారు. అలాంటివారు.జాగ్రత్తగా మంచి ఆహారాలను పండ్ల రసాలను తీసుకుంటు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
కొంతమందిలో గర్భిణీలు మొదటి మూడు నెలలు వరకు ఎలాంటి పొజిషన్లో పడుకున్న ఇబ్బంది ఉండదు కొంత మందికి బోర్లా పడుకోవడం అలవాటు ఉంటుంది.
గర్భిణీలు బోర్లా మాత్రం పడుకోకుడదు. నాలుగవ నెల నుంచి సైడ్ కి పడుకుంటే మంచిది.
ముఖ్యంగా ఎడమవైపు పడుకుంటే మంచిది ఎక్కువ ఎడమవైపు పడుకుంటే వొళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి.
ఎడమ వైపు గాని కుడి వైపు గాని ఎటు వైపు పడుకున్న మంచిదే కానీ ఎడమ వైపు పడుకోవడం వల్ల బేబీకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.ఉమ్మనీరు పెరగడానికి అవకాశం ఉంటుంది.దీనితో పాటు బేబీ బరువు కూడా పెరుగుతుంది.
కిడ్నీకి రక్త ప్రసరణ జరగడం వల్ల మాయ కు కూడా రక్త ప్రసరణ బాగా అంది ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్ సప్లై ఆక్సిజన్ సప్లై కూడా బాగా జరిగి బేబీ గ్రోత్ పెరగడానికి దోహదపడుతుంది.
అందుకే సాధ్యమైనంతవరకు ఎడమ వైపు పడుకుంటే మంచిది. చాలామంది గర్భిణీలు డెలివరీ సమయంలో ఉమ్మనీరు తగ్గడం ,పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
అసలు ఉమ్మనీరు అంటే ,గర్భ నిర్ధారణ అయినప్పటి నుంచి పిండం చుట్టూ పొర ఏర్పడుతుంది .ఆ పొరలకు ఉమ్మనీరు చేరుతుంది. ఇది బిడ్డకు రక్షణగా ఉంటుంది.
ఉమ్మనీరు ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్యలో 22 నుంచి 24 శాతం ఉమ్మనీరు ఉంటే నార్మల్ గా ఉంది అంటారు.
25 కంటే ఎక్కువ శాతం ఉంటే బేబీలో లోపం కానీ ,తల్లిలో లోపం కానీ అంటే బేబీలో ఏవైనా అవయవ లోపాలు ఉన్న లేకపోతే హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, గ్యాస్టిక్ లో లోపం ఉన్న వెన్నుముక లో గాని, మొదలైన కిడ్నీ సమస్యలు వంటివి ఉంటే ఉమ్మనీరు పెరుగుతుంది.
కానీ అన్నీ నార్మల్ గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు.
దానితో పాటు తల్లికి షుగర్ లెవెల్ సరిగా ఉన్నాయో లేదో మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయా లేదో చూస్తారు.
కొంతమందికి షుగర్ ముందుగానే ఉంటుంది కొందరికి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది అందుకే షుగర్ లెవెల్ సరిగ్గా ఉండేలాగా చూస్తూ అబ్జర్వేషన్ లో ఉండాలి.
ఉమ్మనీరు కంట్రోల్ కోసం డైట్ ,ఎక్ససైజ్ వంటివి డాక్టర్లు చెబుతారు.దీని వలన ఉమ్మనీరు తగ్గుతుంది.
అయినా కూడా అంటే డైట్ వల్ల ఎక్ససైజ్ వల్ల ఉమ్మనీరు తగ్గకపోతే అప్పుడు వైద్యుల సమక్షంలో ఇన్సులిన్ కి వెళతారు.
కొంతమందికి ఉమ్మనీరు తక్కువగా ఉంటుంది.
తక్కువగా నీరు తాగడం వల్ల కూడా ఉమ్మ నీరు తగ్గుతుంది.
అందుకే గర్భిణీలు ముఖ్యంగా రోజుకి ఐదు లీటర్ల నీరు తప్పక త్రాగాలి.
కొంత మందిలో ఉమ్మనీరు తగ్గడం వల్ల తల్లి నుండి బేబీ కి రక్త ప్రసరణ కష్టం అవుతుంది అలాగే బేబీ కదలికలు కూడా తెలియవు.
పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హై బిపి, షుగర్ లెవెల్ను తగ్గిస్తుంది.
దనితో పాటు గుమ్మడి గింజల పప్పు,వేరుశనగలు వంటివి తినడం వల్ల కూడా ఉమ్మనీరు పెరుగుతుంది.
దీనితో పాటు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది.కాబట్టి ఇవన్నీ గమనించి జాగ్రత్త వహిస్తూ ఉండండి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in