Ragi Upma:రాగి ఉప్మా రాగి ఉప్మా తినడం వల్ల ఆరోగ్యానికే కాదు బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా మంచి అల్పాహారం. ముందుగా రాగి ఉప్మా తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు రాగి పిండిని తీసుకొని (లో ఫ్లేమ్) లో వేయించండి .దీనిలో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేయండి.ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కట్టి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. అదే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి దానిలో ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ,సాయి మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ వేరుశనగలు జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా తురిమిన చిన్న అల్లం ముక్కను వేయండి అవి వేగిన తరువాత సన్నగా పొడవుగా కోసిన ఒక పెద్ద ఉల్లిపాయను ,సన్నగా తురిమిన చిన్న బంగాళదుంప ,చిన్న క్యారెట్ ,ఒక టమాటాను, తగినంత ఉప్పును వేసి మూత పెట్టి బాగా ఉడికించండి. పది నిమిషాల తర్వాత మూత తీసి (మనం తీసుకున్న మిశ్రమానికి) మూడు కప్పుల నీటిని దానిలో వేసి మరిగించండి. ఇలా మరిగిన నీటిలో ముందుగా చేసుకున్న బొంబాయి రవ్వ, రాగి పిండిని వేసి గరిటతో తిప్పుతూనే ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి .అంతే వేడి వేడి ,టేస్టీ టేస్టీ నోరూరించే రాగి ఉప్మా రెడీ అయినట్లే.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in