RaguluRagulu
0 0
Read Time:7 Minute, 45 Second

Ragulu:చాలామందికి బరువు తగ్గడానికి లేదా షుగర్ ఉన్నవారికి రైస్ మానేయమని అందరూ చెప్తారు కానీ ఈ అన్నానికి బదులుగా ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రైస్ మానేయడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. దీని వలన వెయిట్ తగ్గడానికి టైం పడుతుంది. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల క్యాలరీస్ పెరుగుతాయి.

దీని వలన బరువు పెరుగుతారు. షుగర్ కంట్రోల్ లో ఉండదు. అందుకే అన్నానికి బదులుగా అందరికీ చపాతీను, జొన్న రొట్టెలో లేదా రాగి జావో తాగడం అందరికీ అలవాటు అయ్యింది.

అసలు రాగుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.

100 గ్రాముల రాగుల శక్తి 320 క్యాలరీలు, చాలా తక్కువ క్యాలరీస్. బియ్యం లోని 347 లేదా 350 క్యాలరీలు ఉంటాయి.

రాగుల్లో కార్బోహైడ్రేట్స్ 67 గ్రాములు ఉంటాయి. బియ్యం లో 77 గ్రాములు ఉంటాయి. రాగుల్లో ప్రోటీన్ సెవెన్ గ్రామ్స్ ,కొవ్వు శాతం 2 గ్రామ్స్, ఫైబర్ శాతం 11 గ్రామ్స్ ఉంటుంది.

ఫైబర్ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది. బియ్యం లో ఒక్క శాతం మాత్రమే ఉంటుంది. ఫైబర్ అన్నిటికన్నా ముఖ్యమైనది. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి.

100 గ్రాముల రాగులు తీసుకుంటే కాల్షియం 364 గ్రామ్స్ ఉంటుంది. ఎముక తయారు కావాలి అంటే కాల్షియం తో పాటు ఫాస్ఫరస్ కూడా కావాలి. ఫాస్ఫరస్ శాతం దాదాపు 444 ఉంటుంది.

రాగుల్లో కాల్షియం ఫాస్ఫరస్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రాగుల్లో ఐరన్ శాతం ఐదు మిల్లీ గ్రాములు. ఫోలిక్ యాసిడ్ 35 మైక్రోగ్రామ్స్.

సిలీనియం 15 మైక్రోగ్రామ్స్. సిలినియం అనేది యాంటీ ఆసిడ్ గా పని చేస్తుంది.

ముఖ్యంగా రాగుల్లో స్థూల,సూక్ష్మ విలువలు ఇవి.రాగులను ఎన్ని విధాలుగా ఆహారలోకి తీసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువమంది రాగులను ఉపయోగించేవారు ఎక్కువగా రాగిజావని తయారు చేసుకుని తాగుతూ ఉంటారు.

పూర్వకాలంలోని ఎక్కువగా రాగిజావను అందరూ తాగుతూ ఉండేవారు. ఎముకలు గట్టిపడడానికి ఈ రాగులను ఉపయోగిస్తూ ఉండేవారు.

ఏ ఆహారంలోని ఇంత ఎక్కువ కాల్షియం, ఫాస్ఫరస్ అంటూ ఉండవు. అందుకే ఆ రోజుల నుంచి నీటిలోని రాగి పిండిని వేసి, కాస్త బెల్లం వేసి కలిపి రాగిజావని తయారు చేసుకుని తాగేవారు.

మజ్జిగలో కూడా రాగిజావని కలిపి త్రాగేవారు. చలువ చేస్తుంది మరియు బలాన్ని ఇస్తుంది అని. ఈ రోజుల్లో కూడా చాలామంది హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

అందరూ రాగులు ఎక్కువగా వాడుతున్నారు. రాగి జావ కంటే రాగి రొట్టెలు ఎక్కువ శక్తినిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి,షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా మంచిది.

దీనిలో గ్లూకోన్ ఫ్రీ కాబట్టి ఇది ఎవరికైనా శ్రేష్టమైనది. గోధుమలు వేడి చేస్తాయి. రాగులను వేడి చేయవు.

రాగి పిండిని పుల్లటి మజ్జిగలో కలిపి అట్టు లాగా చేసుకొని తింటే ఇంకా మంచిది. తినటానికి కూడా చాలా అణువుగా ఉంటుంది.

రాగి ముద్ద అందరికీ తెలుసు.. బరువు తగ్గాలనుకునేవారు షుగర్ పేషెంట్స్ లాంటివారి ఈ రాగి ముద్ద తినకపోవడమే మంచిది.

కానీ రాగి ముద్ద ఎవరికి శ్రేష్టం అంటే హార్డ్ వర్కర్స్ కి,బరువు పనులు బాగా చేసేవారు, బరువు పెరగాలి అనుకునే వారికి,

ఆటలాడే పిల్లలకి, జిమ్,ఎక్ససైజ్ ,బాడీ బిల్డింగ్, లిఫ్టింగ్ చేసే వారికి గర్భిణీలకు, బాలింతలకు అన్నం మానేసి ఈ రాగి ముద్ద తినడం శ్రేష్టం ఇది రోజు తినడం చాలా మంచిది.

దీనిలో క్యాలరీస్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ అలాగే, రాగి పిండితో కేక్స్ తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు.

రాగి పిండి లడ్డూలను తయారు చేసుకోవచ్చు.రాగి టిఫిన్స్ లో కూడా వాడొచ్చు.అన్ని రకాలుగా రాగి పిండిని వాడొచ్చు.

దీనివలన ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో ఉన్న ఫైటో కెమికల్స్ కారణంగా 67 పర్సన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ స్లోగా బ్లడ్ లోకి వెళ్తాయి. స్లో గా గ్లూకోజ్ గా మారుతాయి.

పైగా దీనిలో ఉన్న ఫైబర్ చక్కెర స్లోగా వెళ్ళడానికి ఫైబర్ సహాయపడుతుంది. అంటే బ్లడ్ లోకి గ్లూకోజ్ స్లోగా వెళుతుంది.

దీనివలన షుగర్ త్వరగా పెరగదు. స్లోగా గ్లూకోజ్ వెళ్లడం వల్ల కొవ్వుగా మారే అవకాశం బాడీ కలిగించదు. స్లోగా వెళ్లడం వలన కొవ్వు కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే బరువు తగ్గాలనుకున్న,షుగర్ రాకుండా ఉండాలన్న నెంబర్ వన్ ఆహారం రాగులు.

దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్ట్రోపోరోపిస్ ఉన్నవారికి, ఎముకలు గొల్ల బారిన వారికి, జాయింట్ పెయిన్స్

ఉన్నవారికి, ఎముకలు వీక్ గా ఉండి ఎముకలు నొప్పిగా ఉండే వారికి అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది.

11 గ్రామ్స్ ఫైబర్ ఉంది కాబట్టి రాగి ముద్ద రాగి రొట్టె ఏది వాడినా మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. దీనితోపాటు ఐరన్, పోలిక్ యాసిడ్ ఉండడం వల్ల రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

రాగులు తింటే రక్తహీనత అనేది రాదు. కాబట్టి రాగులు చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు రాగులను మన ఆహారంలో తీసుకోవడం మంచిది.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *