RDO Jangareddygudem:వేలేరుపాడు మండలం తూర్పుమెట్ట గ్రామాన్ని బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య సందర్శించారు. బాధితులను వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు.
ఈ సందర్బంగా బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, పాలు, కొవ్వొత్తులు, వాటర్ ప్యాకెట్లు, మస్కిటోకాయిల్స్, బిస్కట్లు అందజేశారు. ఏలూరు రెడ్ క్రాస్ సొసైటీ నుండి వచ్చిన వస్తువులను కూడా తూర్పుమెట్ట వరద బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22వ తేదీన భద్రాచలం వద్ద 48 అడుగుల నీరు చేరగా తూర్పుమెట్ట గ్రామానికి వెళ్ళు మార్గము నీట మునగడంతో సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వేలేరుపాడు మండలంలో 36 గ్రామాలు వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి సహాయ చర్యలు నిర్వహిస్తున్నామన్నారు. కోయిదా, కటుకురు, నార్లవరం, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము, రేపాకగొమ్ము పంచాయితీల్లోని వరద ప్రభావిత కటుంబాలకోసం 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో భోజనం, పాలు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శివకాశీపురంలో గల పునరావాస కేంద్రానికి వేలేరుపాడు గ్రామం నుండి 27 కుటుంబాలను, నెమలిపేటలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి రేపాకగొమ్ము నుండి 270 కుటుంబాలను తరలించడం జరిగిందన్నారు. ప్రభావిత గ్రామాల్లో కూరగాయలు, పాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, వాటర్ ప్యాకెట్లు, మస్కిటోకాయిల్స్, బిస్కట్లు, 1490 టార్పాలిన్లు పంపిణీ చేశామన్నారు. ముందస్తుగా అవసరం మేరకు మరిన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. సహాయ చర్యలకోసం ఎన్ డిఆర్ఎప్, ఎస్ డిఆర్ఎఫ్, పైర్ డిపార్ట్ మెంట్ బృందాలను అందులో ఉంచడం జరిగిందన్నారు. అదే విధంగా తూర్పుమెట్ట గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవుట వలన బోటునుకూడా ఏర్పాటు చేశారన్నారు. వైద్య ఆరోగ్య శాఖచే వైద్య శిబిరాన్నికూడా ఏర్పాటు చేయడమైనదన్నారు. వరదలకు ముందే బియ్యం, కందిపప్పు ముందుగానే నిల్వచేయడం జరిగిందన్నారు. ఆర్ డబ్ల్యూఎస్ సిబ్బంది గ్రామానికి సరిపడా వాటర్ ప్యాకెట్లు ముందుగానే అందజేశారన్నారు. గ్రామములో వాస్తవంగా నివసిస్తున్న 70 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, . బిస్కట్లు, మస్కిటో కాయిల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధముగా అన్ని ఇళ్లకు పై కప్పులకు ఏర్పాటుకు టార్పాలిన్లు పంపిణీ చేశామన్నారు. ఆర్డివో వెంట వేలేరుపాడు తహశీల్దారు జి. చిన్నారావు, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in