Read Time:1 Minute, 35 Second
Response:ఏలూరు: ఆగష్టు 08: చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఇటీవల డెంగ్యూ జ్వరంతో పుచ్చా సీతారాముడు మృతి చెందడంతో జిల్లా కలెక్టర్‌కు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ లేఖ ద్వారా స్పందించి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సహకారంతో అధికారులు చర్యలు చేపట్టారు.
- రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు.
- మురుగునీటి కోసం జేసీబీలతో కచ్చా కాలువలు తవ్వారు.
- దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించారు.
- రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
- వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులకు అవసరమైన మందులను అందించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులను చింతలపూడి కార్పొరేషన్ కమిషనర్ బీజీ ఎస్పీ రాజు పర్యవేక్షించారు. సత్వర చర్యలు చేపట్టడం అభినందనీయమని, అన్ని పంచాయతీల్లో ఇలాంటి చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఆదేశించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in