Rice Water Benefits:రైస్ వాటర్ తో ఉపయోగాలుకొన్ని కొన్ని ఆహార అనుబంధల పదార్థాలను మనం పనికిరానివి అనుకొని పారబోస్తూ ఉంటాము. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది బియ్యం కడుగు.
ఆయుర్వేదంలో దీనిని తడు లోదకం అంటారు. బియ్యం కడిగిన నీటితో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటారు.
కొంతమంది మొక్కలకి వేస్తూ ఉంటారు చాలా మందికి తెలిసింది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నీళ్లను వేసిన మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉండి ఏపుగా పెరుగుతాయి.
ఈ నీళ్లను మొక్కకు పోయడమే కాదు. మీరు అలా జుట్టును పెంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు మొక్కలు ఎలా పెరుగుతాయో ఈ జుట్టు కూడా అలాగే పెరుగుతుంది.
కాబట్టి జుట్టు ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఈ కడుగుని మీ జుట్టు ఎదుగుదలకు ఉపయోగించవచ్చు. ఈ కడుగుని పాడేయకుండా వాడుకోవాలి.
ఈ కడుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల లేదా ఈ కడుగుతో జుట్టు కడుక్కునప్పుడు మీ జుట్టు ఒత్తుదనం పెరుగుతుంది. అలాగే జుట్టు తాలూకు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.ఈ బియ్యం తాలూకు ఈ ఉదకానికి ఎందుకు ప్రత్యేకత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇన్స్టాల్ అనే కార్బోహైడ్రేట్ దీనివల్ల జుట్టు అనేది ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.
ఈ కార్బోహైడ్రేట్ సాధారణంగా బియ్యం కడిగిన నీటిలో ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఈ నీటిలో బీ కాంప్లెక్స్ ఉంటుంది అని చాలామందికి తెలుసు.
బియ్యం కడిగిన నీటితో తల స్నానం చేస్తే చుండ్రు కూడా తగ్గుతుంది. తలపై వచ్చే చిన్న చిన్న పొక్కులు కూడా తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కడుగు వల్ల జుట్టు నిగనిగల లాడుతుంది.
కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏమిటంటే కొంత మందికి జుట్టు జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు మాత్రమే కడుగుతో తల స్నానం చేయకూడదు. ఒకవేళ చేస్తే జుట్టు పొడిబారిపోతుంది.
ఎలా వాడుకోవాలి అంటే వారానికి ఒకటి లేక రెండు సార్లు మాత్రమే ఈ కడుగుతో తల స్నానం చేయాలి. బియ్యం నీళ్ల తయారీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీటిని పోయాలి. బియ్యాన్ని చేతితో బాగా రుద్దాలి. 30 నిమిషాల తరువాత నీళ్లు అన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ కడుగుని తలపై పోసుకొని బాగా మర్దన చేయాలి. తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు హెల్తీగా ఉంటుంది.
అలాగే బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు మాత్రమే కాదు.దీనితో మీ ఫేస్ ను కూడా రోజు కడుక్కుంటే మీ ఫేస్ గ్లో అవుతుంది. ఈ బియ్యం కడిగిన నీళ్లతో ఫేస్ సిరం కూడా తయారు చేయొచ్చు.
ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో బియ్యం మునిగేలా కాస్త వాటర్ ని పోసి నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత వడకట్టి ఆ నీటిని తీసి దానిలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ అలోవెరా జెల్, 2 విటమిన్E క్యాప్సిల్ను వేసి సీరం లా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి.
రోజు ఈ వాటర్ ని ఫేస్ కి అప్లై చేస్తే మీ ఫేస్ గ్లో అవుతుంది. అంతేకాదు స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది.