Sand:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీకి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాపై జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు దాడులు చేసి పరిమితికి మించి లోడ్ ను కలిగిన తెలంగాణా రాష్ట్రానికి చెందిన 3 లారీలు సీజ్ చేశారు.

కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదన్న పక్కా సమాచారం తో డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం పోలవరం డియస్పి, డిడి మైన్స్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడిలో అనుమతి పొందిన పరిమాణంకన్నా ఎక్కువ పరిమితితో ఇసుకను తరలిస్తున్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన 3 లారీలను లంకాలపల్లి వద్ద పట్టుకున్నారు. లారీలను అశ్వారావుపేట లో ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి లో కాటా వేయించగా పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. లారీలను సీజ్ చేసి, లారీ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు డిపిఓ చెప్పారు. ఈ విషయంపై విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిపిఓ చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in