Sand online Registration:ఏలూరు,సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక నిర్వహణ వ్యవస్థ ద్వారా ఇసుకను పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రవాణా సేవలు ఈనెల 11వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంత కుమారి తెలిపారు.
http://sand.ap.gov.in/#/registrations/transporter-registration వెబ్సైటు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వెబ్సైటు లో సూచించిన అన్ని తప్పనిసరి ఫిల్డ్ లను పూరించి ‘ సేవ్’ బటన్ పై క్లిక్ చేయలన్నారు. విజయవంతమైన నమోదు తర్వాత, ధృవీకరణ కోసం రవాణాదారు సమాచారం డియంజివో లాగిన్ కి పంపబడుతుందన్నారు. డి.యంజి వో నుండి ఆమోదం పొందిన తర్వాత, ట్రాన్స్పోర్టర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వినియోగదారు పేరు మరియు పాస్ వర్డ్ ను పొందుతారన్నారు. ట్రాన్స్ పోర్టర్ లాగిన్ అయిన తర్వాత వారు రెండు పేజీలకు యాక్సెస్ కలిగి ఉంటారన్నారు. 1. వెహికల్ మాస్టర్ మరియు 2. డ్రైవర్ సమాచారాన్ని జోడించడానికి డ్రైవర్ వివరాలు. వాహన రిజిస్ట్రేషన్ ట్రాన్స్ పోర్టర్ జోడించిన తర్వాత వాహనాన్ని స్టాక్ యార్డ్ కు లింక్ చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాన్స్ పోర్టర్ లింక్ ఎంపికను ఉపయోగించి వాహనాన్ని స్టాక్ యార్డ్ కు లింక్ చేయాలన్నారు. ట్రాన్స్ పోర్టర్ కు వాహనాన్ని” డిలింక్” చేసే ఎంపిక ఉంటే (ఆర్డర్ మాత్రమే కేటాయించబడకపోతే డిలింక్ మాత్రమే) పని చెస్తుందని శాంతకుమారి తెలియజేసారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in