Sesame Oil:నువ్వుల నూనెతో నిగారింపు నిమ్మరసంలో, చిటికెడు పసుపు వేసి ముఖానికి రాస్తే సరి. జిడ్డుతత్వం తగ్గి చర్మం నిగరింపుగా కనిపిస్తుంది.
రెండు కప్పులు ఉసిరి పొడిలో, కప్పు పెరుగు, అర చెక్క నిమ్మరసం కలిపి తలకు ప్యాక్ వేస్తే వెంట్రుకలు మృదువుగా మారుతాయి.
దాంతోపాటు చుండ్రు సమస్య తగ్గుతుంది. అరకప్పు నువ్వుల నూనెలో, గుప్పెడు గులాబీ రేఖలు, చెంచా మెంతులు వేసి మరిగించండి. ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగుల రాసి మర్దన చేస్తే సరి.
ఇలా రోజు చేస్తుంటే చర్మం ఛాయ మెరుగుపడుతుంది. పావు కప్పు బాదం ముద్దకు కొద్దిగా వట్టివేళ్ల పొడి చెంచా, కస్తూరి పసుపు, రెండు చెంచాలు ఆముదం కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. మిశ్రమాన్ని మెడ, చేతులు, ముఖానికి రాసి నీళ్లతో తడుపుతూ మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేస్తే మృత కణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
కోడిగుడ్డు తెల్ల సోనాలో కాస్త చెంచా ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా గెలకొట్టాలి. దాన్ని జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in