Skipping Breakfast:టిఫిన్ మానేస్తే ఏమవుతుంది బరువు తగ్గాలనుకుని అల్పాహారాన్ని మానేస్తాము తగ్గకపోగా నీరసం, నిస్సత్తువ తోడయ్యాయి.

జుట్టు రాలడం మొదలయ్యింది. ఉదయం ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలను అందించే అల్పాహారాన్ని మానేయడం సరైనది కాదంటున్న నిపుణులు.
జీవక్రియలు శరీరానికి దాదాపు 12 గంటల విరామం తరువాత అందించే అల్పాహారం జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది.
ఈ విరామాన్ని పెంచిన లేదా పూర్తిగా దాటవేసిన కూడా జీవ క్రియల వేగం క్రమేపి మందగిస్తుంది. క్యాలరీల శక్తిని నెమ్మదిగా శరీరం కోల్పోతుంది. దాంతో కొవ్వు పెరుగుతుంది.
అల్పాహారాన్ని తీసుకొని వారిలో కన్నా తీసుకున్న వారిలో జీవక్రియల వేగం అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు కూడా తేల్చాయి.
శరీరంలోని చక్కెర స్థాయిలను అల్పాహారం సమన్వయం చేస్తుంది. లేదంటే మైగ్రేన్ సమస్య, రక్తపోటు వంటి వచ్చే ప్రమాదం ఉంది.
శిరోజాలపై: పలు రకాల అనారోగ్యాలకు కారణమయ్యే అల్పాహారం దాటివేత కురులను ప్రభావితం చేస్తుంది. ప్రోటీన్ల శాతం తగ్గడంతో శరీరంలోని కెరోటిన్ స్థాయిల్లో మార్పులు చోటు చేసుకుంటది.
దీంతో శిరోజాలు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో జుట్టు రాలుతుంది. ఒత్తిన జుట్టు కావాలంటే ప్రోటీన్లను ఉదయం ఆహారంలో అధిక మొత్తంలో తీసుకోవడం తప్పనిసరి.
అల్పాహారం తీసుకోకపోవడంతో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. అధిక బరువు సమస్య దరిచేరుతుంది. లండన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించిన నివేదిక ప్రకారం ఈ సమస్య క్యాన్సర్ కు కారణం కూడా కావచ్చు.
కాబట్టి అధిక ప్రోటీన్స్ ఉన్న టిఫిన్లు ఎంచుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in