Sleveless:స్లీవ్ లెస్ ఇంక సమస్య కాదు చాలా మందికి స్లీవ్ లెస్ టాప్స్ చాలా ఇష్టం. అయితే బహు మూలాల్లో చర్మం నలబడినట్లుగా అవడంతో నచ్చిన దుస్తులను వేసుకోలేక పోతాము.
ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఈ సమస్య నుండి విముక్తి కలుగుతుంది.
హైపర్ పెగ్మెంటేషన్ గాడత ఎక్కువగా ఉండే డియో లు వాడటం, శుభ్రత పాటించకపోవడం లాంటి కారణాలతో బహు మూలాలలో చర్మమంతా నల్లగా మారుతుంది. మెలినిన్ తగ్గినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది.
తాజా కలబంద గుజ్జును రాసి 20 నిమిషాలు అయ్యాక శుభ్రం చేస్తే చాలు రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే మెల్లగా నలుపు తగ్గుతుంది. పావు కప్పు నీటిలో పెద్ద చెంచా వంట సోడా కలిపి పేస్ట్ లా చేసి బహు మూలాల్లో అప్లై చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే విటమిన్ E లేదా కొబ్బరి నూనె రాసి పావుగంట అయ్యాక నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
రెండు చెంచాల చప్పున వంట సోడా, యాపిల్ సిడర్, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని ఆ ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి. సహజ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసే నిమ్మ చెక్కతో సమస్య ఉన్న చోటే ఇలా చేస్తే క్రమేపి నలుపుదనం దూరం అవుతుంది.
బంగాళదుంప రసం లేదా గుండ్రంగా సన్నగా తరిగిన ముక్కతో మృదువుగా రుద్ది ఆరనిచ్చి శుభ్రం చేసిన ఫలితం ఉంటుంది.
పెరుగు, నిమ్మరసం, పసుపు, శెనగపిండిని మిశ్రమల చేసి ప్యాక్ లాగా వేసి 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నలుపు తనం పోతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in