Solar Eclipse:సూర్యగ్రహణం 2024 సంవత్సరం, ఏప్రిల్,8 తేదీన అమావాస్య అయినా సోమవారం నాడు సంభవిస్తున్న అతి పెద్ద సూర్యగ్రహణం.
అలాగే శని ,కుజుడు యొక్క సంఘర్షణ ప్రభావం ఈ సూర్యగ్రహణం పై ఎలా ఉంటుంది. అలాగే ద్వాదశ రాశి వారి గ్రహణం కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
2024 సంవత్సరానికి గాను మొదటిసారి వచ్చిన సూర్యగ్రహణం అతిపెద్ద సూర్యగ్రహణంగా నిర్ణయించబడింది.
ఎందుకంటే ఈ సూర్యగ్రహణం పూర్తి అయ్యే చేరుకున్న సరికి తర్వాత ఎప్పుడూ లేనివిధంగా దాదాపు 4 నిమిషాల,35 సెకండ్ల మానవాళికి దర్శనం ఇవ్వబడుతుంది.
అందుకే ఈ సూర్యగ్రహణం అతిపెద్ద సూర్య గ్రహణంగా చెప్పబడుతుంది.ఇది ఏప్రిల్ ,ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అమావాస్య తిధి నందు మీనరాశి రాహు గ్రస్త సూర్యగ్రహణం గా సంభవించబడుతుంది.
దీనికి తోడుగా శని ,కుజుడు కలయిక కూడా ఉండడం వల్ల ఇది పెద్ద సమస్యగా మారింది.
పరస్పరం శత్రువుల ఉండే శని ,కుజుడు ఒకే రాశిలో ఉండడం మరియు అతి పెద్ద సూర్యగ్రహణం సంభవించడం ఈ రెండు మానవాళికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.
ఈ సూర్యగ్రహణం కారణంగా ప్రపంచం మొత్తం మీద దుమారం రేపే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా రాజకీయం కుంభకోణాల మీద సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం పెరగవచ్చు.
తుఫాను అలజడులు కూడా ఎక్కువ ఉండవచ్చు.
అని జ్యోతిష్యులు వివరిస్తున్నారు కానీ ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు కెనడా మెక్సికో అమెరికా దేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మన భారతీయులు శాస్త్ర ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే నార్త్ అమెరికా ,పసిఫిక్ మహాసముద్రం, యూరప్ దేశాల్లో మాత్రము పాక్షికంగా గ్రహణం దర్శనమిస్తుంది. మన భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున రాత్రి 9 గంటల,21 నిమిషాలకు ప్రారంభం అయ్యి 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది.దాదాపు 272 సెకండ్లో పాటు పూర్తిస్థాయిలో అందరికీ దర్శనమిస్తుంది.
గ్రహణ స్పర్శ కాలము: రాత్రి 9 గంటల 21 నిమిషాలకు, గ్రహణ మధ్య కాలము :రాత్రి 11:47 నిమిషాలకు, గ్రహణ మోక్ష కాలము: 2 గంటల 15 నిమిషాలుగా ఉన్నాయి.
మేషరాశి వారు సంపాదన మరియు ఖర్చుల విషయాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిధున రాశి వారు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ లో చిన్న చిన్న లోపాలు ఏర్పడవచ్చు.
కర్కాటక రాశి వారికి తండ్రితో గొడవలు, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
సింహ రాశి వారికి ఆరోగ్య లోపాలు అధికమవుతాయి.
కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది.వ్యాపార భాగస్వామ్యం కూడా కలిసి రాదు. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి వారికి రుణ బాధలు ,శత్రుత్వాలు ,అనారోగ్య లక్షణాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి వారికి వారి యొక్క సంతానం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ధను రాశి వారు లోని హెల్త్ కి సంబంధించిన మరియు తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి వారు తోబుట్టులతో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి వారు మాట తీరు విషయంలో జాగ్రత్త ఉండాలి. మీ మాటకు వ్యతిరేక అర్ధాలు పెరిగే ప్రమాదం ఉంది.
మీన రాశి వారు మానసికంగానూ, శారీరకంగానూ టెన్షన్ కి గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు.
కాబట్టి భారతీయులు అందరూ భయపడవలసిన పనేమీ లేదు. బయట దేశాల్లో ఉన్న వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
ఈ గ్రహణం పూర్తిగా రాత్రి సమయంలో ఉంటుంది. కాబట్టి గర్భవతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏమీ లేదు.
ఈ గ్రహణం కనిపించిన కనిపించకపోయినా ఈ సమయంలో మనం చేసే మంత్ర జపం మనకు విలువైన ఫలితాలను అందిస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in