elurueluru
0 0
Read Time:4 Minute, 57 Second

Stals:ఏలూరు, ఆగష్టు, 15.. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అందరిని ఆకట్టుకున్నాయి. గురువారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాల్స్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జడ్జి సి. పురుషోత్తమ కుమార్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, , జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి. పుష్పమణి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, నూజివీడు ఆర్డిఓ వై. భవానీశంకరి సందర్శించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మా, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ, మైక్రో ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ, విద్యాశాఖ, బ్యాంకింగ్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని ప్రదర్శించారు. ఈ సందర్బంగా డి ఆర్ డి ఎ అధ్వర్యంలో 3 వేల 511 మహిళ గ్రూపులకు రూ.284.69 కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశారు. అదే విధంగా స్త్రీనిధి కింద 1429 సంఘాలకు రూ. 47.90 కోట్లు, ఉన్నతి కింద 155 సంఘాలకు రూ. 1.55 కోట్లు పంపిణీ చేశారు.

అదే విధంగా ఇటీవల గోదావరి వరదల సమయంలో వేలేరుపాడు మండలం తిరుమలాపురం, రేపాకగొమ్మె పంచాయితీల్లోని గ్రామ సంఘాలకు స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రసెల్వ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు సాయిదుర్గ గ్రూపుకు రూ. 4.50 లక్షలు, గోదావరి గ్రూపుకు రూ. 4 లక్షలు, కోకిలా గ్రూపుకు రూ. 4.50 లక్షలు అందజేశారు. అదే విధంగా బ్యాంక్ లింకేజ్ కింద వేలేరుపాడు మండలం తిరుమలాపురం పంచాయితీ కి చెందన సాయితేజ గ్రూపుకు రూ. 3 లక్షలు పంపిణీ చేశారు.

ఉపకరణాల పంపిణీ…
విభిన్న ప్రతిబావంతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో 19 మంది దివ్యాంగులకు రూ. 8.5 లక్షలతో ల్యాప్ టాప్ లు, 3 మంది దివ్యాంగులకు రూ. 51 వేల విలువైన 3 టచ్ ఫోన్లు, అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు. పలువురుకు కృతిమ అవయవాలు మంత్రి పార్థసారథి స్వయంగా అమర్చారు.

జిల్లా వ్యవసాయశాఖ జేడి ఎస్ కె. హబీబ్ భాషా, ఉధ్యానశాఖ డిడి ఎస్. రామ్మోహన్, ఎపిఎంఐపి పిడి రవికుమార్, డిఇఓ ఎస్. అబ్రహాం, డిఆర్ డిఎ పిడి ఆర్. విజయరాజు, ఐసిడిఎస్ పిడి పద్మావతి, మెప్మా పిడి ఇమ్మానియేల్, మత్స్యశాఖాధికారి, పశు సంవర్ధకశాఖ జేడి జి. నెహ్రూబాబు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమంగా నిలిచిన స్టాల్స్…
వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఐసిడిఎస్(మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధమ స్ధానంలో నిలవగా , విద్యాశాఖ రెండవ స్ధానంలో, మత్స్యశాఖ మూడవ స్ధానంలో నిలిచాయి. ఈ సందర్బంగా ఆయా శాఖాధికారులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధ సారధి మెమొంటోలను అందజేశారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *