Sugar in Skincare:పంచదారతో సౌందర్య సంరక్షణ ఆరోగ్యంగా ఉండాలి అంటే తీపి కి అందులోని ప్రత్యేకించి పంచదారకు దూరంగా ఉండాలన్నది తెలిసిందే కానీ ఆరోగ్యానికి చేరువు చేసే పంచదార సౌందర్యం పరిరక్షణలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. అంటున్నారు నిపుణులు. మరి ఇది ఎలాగో చూద్దాం రండి
లేలేతే అధరాలకు సాధారణంగా పెదవుల మీద కొద్దిగా చక్కెర రాస్తే మృత కణాలు తొలగిపోయి మృదువుగా మారుతాయి. కొద్దిగా చక్కెర తీసుకొని అందులో పాలు, తేనె వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని రోజు రాత్రి పూట పడుకునే ముందు పెదవులకు మెల్లగా మర్దన చేసుకుంటే గులాబీ లాంటి లేలేత అధరాలు సొంతమవుతాయి. అయితే ఈ చిట్కా ఎప్పుడో ఒకసారి కాకుండా రెండూ లేదా మూడు రోజులకు ఒకసారి పాటిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. చర్మం పొడిబారి, జీవంగా మారినప్పుడు చక్కెరను ఉపయోగించి తిరిగి దాని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనికోసం కొద్దిగా చక్కెర తీసుకొని అందులో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొని చుక్కలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మళ్లీ కొత్త కళ ను సంతరించుకుంటుంది. వృద్ధాప్య ఛాయలు రానీయకుండా చర్మం ముడతలు పడటం సన్నని గీతలు కనిపించడం వంటి లక్షణాలు ద్వారానే వయసు పై పడుతున్న విషయం పైకి తెలుస్తుంది. చక్కెరను ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే చక్కెర సన్నని గీతాలు కూడా కనిపించకుండా చేస్తుంది. దీనికోసం కొద్దిగా చక్కెర తీసుకొని అందులో నిమ్మరసం వేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత తడి గుడ్డతో తుడుచుకోవాలి. ఇది సూర్యరశ్మిల ఎక్కువ సమయం ఉండటం వల్ల ఎదురయ్యే టానింగ్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను కూడా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
మేని చాయ కోసం చర్మం రంగును పెంచుకోవాలనుకునే వారు కొద్దిగా గంధం తీసుకొని అందులో రోజ్ వాటర్, చక్కెర చెంచా, చొప్పున వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in