Sugar Side Effects:చక్కెర చేటు తియ్యదనానికి దాసోహం కాని వారు అరుదు. అయితే పరిమితికి మించి తీపి తినడం వల్ల ఆరోగ్యానికి చేటు జరుగుతుంది. తీపి తిన్న ప్రతి సారీ శరీరం మరింత తీపి కోసం పాకులాడుతుంది.

దాంతో ఒకసారి తినడంతో సరిపెట్టుకోకుండా తీపి పదార్థాల కోసం అరులు చాస్తూ ఉంటాం. అలా పదేపదే తీపి తినడం ద్వారా అనవసరానికి మించి క్యాలరీలు శరీరంలో పేరుకు పోతూ ఉంటాయి.
చర్మం: చక్కెర చర్మానికి సాగే గుణాన్ని బిగువులు అందించే కొలెజెన్ నాణ్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పెరుగుతాయి. మెరుపు తగ్గి చర్మం జీవం కోల్పోతుంది. వాపులు, నొప్పి ఇన్ఫర్మేషన్ పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కీళ్ల నొప్పులు, వాపులు దీని ఫలితంగా వస్తూ ఉంటాయి.
పొట్టనొప్పి: అజీర్తి ఫలితంగా పొట్టలో వాయువులు పెరిగి నొప్పి వేధిస్తుంది.
దంతాలు: చక్కెర దంతాల ఆరోగ్యాన్ని నష్టం వాటిల్లుతుంది. త్వరగా దంతాలు పుచ్చి ఊడిపోతాయి.
కొవ్వు : తీపి శరీరంలో కొవ్వు ను పేరుకునేలా చేస్తుంది. దీని వలన శరీరం అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in