Summer Face Wash Tips:వేసవిలో చల్లని ఫేస్ వాష్ లు ఎండవేడికి ముఖం కమీలి పోతుంటుంది. ఇటువంటి అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునే సహజ సిద్ధమైన ఫేస్ వాష్ లతో నిత్యం ముఖాన్ని తాజాగా ఉంచొచ్చు.
అటువంటి చల్లచల్లని ఫేస్ వాష్ ల తయారీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ తో: బేబీ సోప్ ను తీసుకొని చిన్నగా తురుముకోవాలి. రెండు క్యారెట్లను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి.
నీటికి బదులుగా అరకప్పు గులాబీ నీటిని వేసి మెత్తగా చేసి రసాన్ని వడకట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని, బేబీ సోప్ తురుము, రెండు చెంచాల యాపిల్ జ్యూస్, రెండు స్పూన్ల వెనిగర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
ఇందులో అర చెంచా ఫిష్ ఆయిల్ వేసి, మరోసారి బాగా షేక్ చేస్తే చాలు క్యారెట్ ఫేస్ వాష్ సిద్ధం. దీన్ని ఓ పొడి గాజు సీసాలో నింపి, ఫ్రిజ్లో ఉంచితే రెండు వారాలు నిల్వ ఉంటుంది. ఉదయం, సాయంత్రం దీంతో ముఖాన్ని శుభ్రం చేస్తే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా మారి మెరుపు వస్తుంది.
అలాగే వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయాలను కూడా దరిచేరనీయదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు రానివ్వవు.
కీరదోసతో: బేబీ సోప్ ను పొడిగా తురుముకోవాలి. రెండు లేదా మూడు కీరదోస కాయలను చిన్నగా తురిమి మిక్సీలో వేసి రసాన్ని వడకట్టుకోవాలి.
ఇందులో 1/2 కప్పు గులాబీ నీటిని, సిద్ధం చేసుకున్న సబ్బు పొడిని కలపాలి. ఈ మిశ్రమాల్లో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, చెంచా నిమ్మరసం వేసి ఎలక్ట్రానిక్ బీటర్ ను ఉపయోగించి నురగ వచ్చేంత వరకు గెలకొట్టి పొడి సీసాలో నింపాలి.
ఫ్రిడ్జ్ లో దీని ఓ వారం నిల్వ ఉంచుకోవచ్చు. ఉదయం ఈ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ ఖనిజ లవణాలు, పోషకాలు ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోలిక్ యాసిడ్ చర్మం మెరిసేలా చేస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in