Summer Vadiyalu:వడియాలు మరియు వడియాలలో రకాలు గురించి తెలుసుకుందాం
ఎండాకాలం అంటేనే అందరూ ఆ సూర్య భగవానుని యొక్క ఎండకి భయపడుతూ ఉంటారు. కానీ ఎండను కూడా ఉపయోగించి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే రకరకాల టేస్టీ వడియాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలం ఈ ఎండలకు వడియాలు బాగా ఎండుతాయి.అదే వర్షాకాలం అయితే ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు రాదో తెలీదు.కాబట్టి వర్షం పడితే వడియాలు తడిచిపోతాయి.
సరిగా ఎండవు. ఇంకా శీతాకాలం లో వచ్చే ఎండలు వడియాలు ఎండడానికి సరిపోదు.దీనివలన వడియాలు ఎండక కుళ్ళు వాసన వస్తుంది.కాబట్టి ఎండాకాలమే వడియాలకు అనువైన సీజన్.
1.బియ్యం పిండి వడియాలు: దీనికి మనకు కావలసిన పదార్థాలు బియ్యం పిండి, సగ్గుబియ్యం ,జీలకర్ర ,పచ్చిమిరపకాయలు, పెసరపప్పు, ఉప్పు ముందుగా రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి.రెండు కప్పుల బియ్యం పిండికి, ఎనిమిది కప్పుల నీటిని తీసుకోవాలి.
తరువాత పావు కప్పు సగ్గుబియ్యాన్ని, పావు కప్పు పెసరపప్పును వేరువేరుగా ఒక గంట సేపు నానబెట్టండి. ఐదు పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టి పక్కన పెట్టండి. రెండు కప్పుల నీటిని బియ్యం పిండిలో వేసి చేతితో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టండి.
తరువాత స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నెలో మిగిలిన ఆరు కప్పుల వరకు నీటిని వేసి మరిగించండి.ఆ నీరు పొంగు వచ్చిన తరువాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని వేసి తరువాత మూడు స్పూన్ల జీలకర్రను, గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలను వేసి బాగా మరిగించండి.
సగ్గుబియ్యం, పెసరపప్పు ఉడికిన తరువాత తగినంత ఉప్పు వేసుకోండి.తరువాత రెండు కప్పులతో నానబెట్టిన బియ్యం పిండిని ఈ మరుగుతున్న దాంట్లో ఉండలు రాకుండా గరిటతో కలుపుతూ వేసుకోవాలి.
ఉప్పు కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని ఇలా పది నిమిషాలు కలిపి స్టవ్ కట్టేయండి.ముందుగా ఎండలో క్లాత్ గాని, కవర్ గాని వేసి దానిపై వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని వడియాల మాదిరి వెయ్యండి. ఈ ఎండకు సాయంత్రం లోగా ఇవి ఎండిపోతాయి.
తరువాత ఆ వడియాలను ఆ క్లాత్ నుంచి తీసి రెండు, మూడు రోజులు ఎండ లో ఎండ పెట్టుకుంటే సగ్గుబియ్యం వడియాలు తయారు అయినట్టే ఈ వడియాలు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
దీనిలో ఉపయోగించే పెసరపప్పు మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు.ఇవి వేసుకోవడం వలన వడియాలు తినేటప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు తగిలి చాలా టేస్ట్ గా అనిపిస్తుంది.
2.బొంబాయి రవ్వ వడియాలు: ఒక పెద్ద గిన్నెను స్టవ్ మీద పెట్టి దానిలో ఎనిమిది కప్పుల నీటిని వేసి మరిగించండి.మీరు పొంగు వచ్చిన తరువాత నానబెట్టిన పావు కప్పు సగ్గుబియ్యాన్ని, 1/4 కప్పు సాయి మినప్పప్పు వేసి మరియు మూడు స్పూన్ల జీలకర్రను, రెండు స్పూన్ల కారాన్ని, తగినంత ఉప్పు ని వేసి బాగా మరిగించండి.
సగ్గుబియ్యం, సాయి మినప్పప్పు ఉడికిన తరువాత రెండు కప్పుల బొంబాయి రవ్వని మరుగుతున్న నీటిలో ఉండలు లేకుండా గరిటతో కలుపుతూ పది నిమిషాలు కలుపుతూ ఉండండి.10 నిమిషాల తరువాత స్టవ్ కట్టేయండి.
ముందుగానే ఎండలో క్లాత్ ని గాని కవర్ని గాని వేసి దానిపై వేడి వేడిగా ఉన్నప్పుడే పిండిని వడియాల మాదిరి వేయండి.ఈ ఎండకు సాయంత్రం లోగా ఇవి ఎండిపోతాయి.
తరువాత వడియాలను ఆ క్లాత్ నుంచి తీసి రెండు, మూడు రోజులు ఎండలో ఎండ పెట్టుకుంటే బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయినట్టే.ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
3.సగ్గుబియ్యం వడియాలు: రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని ఒక గంట నానబెట్టుకోవాలి.స్టవ్ పై ఒక పెద్ద గిన్నెను పెట్టి దానిలో ఎనిమిది కప్పుల నీటిని వెయ్యండి. నీరు పొంగు వచ్చిన తరువాత ఐదు రెమ్మల కరేపాకును, ఐదు పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకోవాలి.
ఈ గ్రైండ్ చేసిన కరివేపాకు, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని ఈ మరుగుతున్న నీటిలో వేసి తరువాత మూడు స్పూన్ల జీలకర్రను, తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.ఇలా మరిగిన నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వెయ్యండి.
సగ్గుబియ్యం ఉడికిన తరువాత స్టవ్ కట్టేయండి.ముందుగానే ఎండలో క్లాత్ నుగాని, కవర్ని గాని వేసి దానిపై ఈ వేడిగా ఉన్నప్పుడే పిండిని వడియాల మాదిరి వెయ్యండి.ఈ ఎండకు సాయంత్రం లోగా ఇవి ఎండిపోతాయి.
తరువాత ఈ వడియాలను ఆ క్లాత్ నుంచి తీసి రెండు, మూడు రోజులు ఎండలో ఎండ పెట్టుకుంటే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయినట్టే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
4.టమోటా వడియాలు: ముందుగా రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఐదు రెమ్మల కరివేపాకును, ఐదు పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఐదు టమాటాలను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై వెడల్పాటి గిన్నెను పెట్టి ఎనిమిది కప్పుల నీటిని వేసి ఆ నీరు పొంగు వచ్చిన తరువాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మరియు జీలకర్రను వెయ్యండి తరువాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన టమోటా గుజ్జును కూడా వేసి మరిగించండి.
సగ్గుబియ్యం ఉడికిన తరువాత తగినంత ఉప్పు వేసి ఐదు నిమిషాలు మరిగించండి.తరువాత స్టవ్ కట్టి ముందుగానే ఎండలో క్లాత్ ని గానీ కావని గాని వేసి దానిపై ఈ వేడి వేడి పిండిని వడియాల మాదిరి వేయండి.
ఈ ఎండకు సాయంత్రంలోగా ఇవి ఎండిపోతాయి.తరువాత ఈ వడియాలు రెండు, మూడు రోజులు ఎండలో ఎండ పెట్టుకుంటే టమాటా వడియాలు రెడీ అయినట్టే.
ఒక డబ్బాలో ఈ వడియాలను స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఈ వడియాలు నిల్వ ఉంటాయి.
5.క్యారెట్ వడియాలు: రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మూడు క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఐదు పచ్చిమిర్చి ఐదు రెమ్మల కరివేపాకును మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నెను పెట్టి దానిలో 8 కప్పుల నీటిని వేసి మరిగించండి.ఈ నీరు పొంగు వచ్చిన తరువాత సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసిన క్యారెట్ గుజ్జును, అలాగే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు మిశ్రమాన్ని జీలకర్రను, తగినంత ఉప్పును వెయ్యండి.
సగ్గుబియ్యం ఉడికిన తరువాత పది నిమిషాలు గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. తరువాత స్టవ్ కట్టి ముందుగానే ఎండలో క్లాత్ ని గానీ, కవర్ని గాని వేసి దానిపై ఈ వేడివేడి పిండిని వడియాల మాదిరి వేయండి. ఈ ఎండకు సాయంత్రంలోగా ఇవి ఎండిపోతాయి.
తరువాత ఈ వడియాలు ఆ క్లాత్ నుంచి తీసి రెండు, మూడు రోజులు ఎండలో ఎండ పెట్టుకుంటే క్యారెట్ వడియాలు రెడీ అయినట్టే.ఒక డబ్బాలో వీటిని స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి .
6.బీట్రూట్ వడియాలు: ముందుగా రెండు కప్పుల సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.మూడు బీట్రూట్ ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఐదు పచ్చిమిర్చి, ఐదు రెమ్మల కరివేపాకును మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 8 కప్పుల నీటిని వేసి బాగా మరిగించండి.
నీరు పొంగు వచ్చిన తరువాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, జీలకర్రను, మరియు గ్రైండ్ చేసి పచ్చిమిరపకాయలు ,కరివేపాకు మిశ్రమాన్ని మరియు బీట్రూట్ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఉప్పుని వేసి బాగా కలపండి .పది నిమిషాలు తరువాత స్టవ్ కట్టేయండి.ముందుగానే ఎండలో క్లాత్ ని గానీ, కవర్ని గాని వేసి దానిపై వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని వడియాల మాదిరి వేయండి.
ఈ ఎండకు సాయంత్రం లోగా ఇవి ఎండిపోతాయి.తరువాత ఈ వడియాలు ఆ క్లాత్ నుంచి తీసి రెండు, మూడు రోజులు ఎండలు ఎండ పెట్టుకుంటే బీట్రూట్ వడియాలు రెడీ అయినట్టే.ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
7.మినప వడియాలు: ఒక కేజీ మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఉదయం ఈ పప్పును బాగా కడిగి మెత్తగా నీరు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. గారెల పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్రను వెయ్యండి.
ఐదు రెమ్మల కరివేపాకు, ఐదు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఈ పిండిలో వేయండి.తగినంత ఉప్పు వేసి, పావు స్పూన్ ఇంగువ, వంట సోడా వేసి బాగా కలపండి.
ఇలా కలిపిన పిండిని ఎండలో ముందుగా ఏర్పాటు చేసిన క్లాత్ గానీ, కవర్ని గాని వేసి దానిపై చిన్న చిన్న ముద్దలుగా పిండిని వేయండి.
సాయంత్రానికి కాస్త ఎండుతాయి. క్లాత్ తోనే ఆ వడియాలను ఉంచి మర్నాడు కూడా ఎండలో పెట్టండి.సాయంత్రానికి ఇంకాస్త ఎండుతాయి.
ఇలా ఎండిన వడియాలను తీసి రెండు , మూడు రోజులు ఎండలు ఆరబెట్టుకుని ఇలా ఆరిన వడియాలను డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
8.పెసరపప్పు వడియాలు: ఒక కేజీ పెసరపప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి.అలా నానిన పెసరపప్పును బాగా కడిగి మెత్తగా నీరు పోయకుండా గ్రైండ్ చేసుకోండి.
గారెల పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్రను వెయ్యండి.ఐదు రెమ్మల కరివేపాకును, ఐదు పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి ఈ పిండిలో వేయండి. తగినంత ఉప్పు, పావు స్పూన్ ఇంగువ మరియు వంటసోడా ను వేసి బాగా కలపండి.
ఇలా కలిపిన పిండిని ఎండలో ముందుగా ఏర్పాటు చేసిన క్లాత్ ని గానీ, కవర్లు గాని వేసి దానిపై చిన్న చిన్న ముద్దలుగా పిండిని పెట్టండి. సాయంత్రానికి కాస్త ఎండుతాయి. క్లాత్ తోనే ఆ వడియాలను ఉంచి మర్నాడు కూడా ఎండలో పెట్టండి.
సాయంత్రానికి ఇంకాస్త ఎండుతాయి. ఇలా ఎండిన వడియాలను తీసి రెండు, మూడు రోజులు ఎండలు ఆరబెట్టుకొని ఇలా ఆరిన వడియాలను డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
9.గుమ్మడి వడియాలు: ఒక కేజీ మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి.ఇలాగే ముందు రోజు రాత్రి ఒక పెద్ద గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్ తో శుభ్రంగా తుడవండి.
తరువాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక క్లాత్ లో వేసి మూటలాగా గట్టిగా కట్టండి.
ఇలా కట్టిన మూటను ఒక పెద్ద బరువైన బండ రాయిన దానిపై పెట్టండి.ఉదయం వరకు అలాగే ఉంచండి.ఇలా పెట్టడం వల్ల గుమ్మడికాయలో ఉన్న నీరు మొత్తం బయటకు పోతుంది. ఉదయం ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి.
ఉదయం నానబెట్టిన మినప్పప్పును శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయండి గారెల పిండి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. ఐదు పచ్చిమిరపకాయలను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకోండి.
ఇప్పుడు ఈ పిండిలో గుమ్మడికాయ ముక్కలను, గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలను, జీలకర్రను, పావు స్పూన్ ఇంగువ, వంట సోడా, తగినంత ఉప్పును వేసి బాగా కలపండి.
ఎండలో క్లాత్ గాని,కవర్ను గాని వేసి దానిపై చిన్న చిన్న ముద్దలుగా పిండిని వేయండి. సాయంత్రానికి కాస్త ఎండుతాయి. క్లాత్ తోనే ఆ వడియాలను ఉంచి మర్నాడు కూడా ఎండలో పెట్టండి. సాయంత్రానికి ఇంకాస్త ఎండుతాయి.
ఇలా ఎండిన వడియాలను తీసి రెండు, మూడు రోజులు ఎండలు ఆరబెట్టుకుని ఇలా ఆరిన వడియాలను డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
మజ్జిగ మిరపకాయలు: ఒక పెద్ద గిన్నెలో ముందుగా ఒక లీటర్ పెరుగు పలచగా మజ్జిగ చేసుకోవాలి.తరువాత బాగా పెద్దగా ఉండే మిరపకాయలు మార్కెట్లో లభిస్తాయి. పెద్ద మిరపకాయలు అయితేనే పెద్దగా కారం ఉండదు.
ఈ మిరపకాయలను పొడవుగా మధ్యలోకి చీల్చి దానిలో వాము వేసి పక్కన పెట్టండి.ముందుగా తయారు చేసిన మజ్జిగలో తగినంత ఉప్పు వేసి దానిలో ఈ మిరపకాయలను మునిగే లాగా వేయండి.
దీనిపై మూత పెట్టి మజ్జిగలో మిరపకాయలను అలాగే రెండు రోజులు ఉంచండి.మూడవ రోజు ఈ మిరపకాయలు బయటకు తీసి ఎండలో క్లాత్ పై ఈ మిరపకాయలను ఎండ పెట్టండి.
ఇలా రెండు, మూడు రోజులు ఈ మిరపకాయలను ఎండలో ఎండ పెడితే మజ్జిగ మిరపకాయలు రెడీ అయినట్టే. ఇవి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in