Tadepalligudem:తాడేపల్లిగూడెంలో ఉన్న పురుగు మందుల పరీక్ష లాబొరేటరికి కావలసిన గ్యాస్ లిక్విడ్ క్రౌమోటోగ్రఫీ మెషిన్ సరఫరా చేయుటకు స్వల్ప కాలిక టెండర్లకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్యాస్ లిక్విడ్ క్రౌమోటోగ్రఫీ మెషిన్, దాని సాప్ట్ వేర్ తో కూడిన కంప్యూటర్ సరఫరా చేయుటకు ఆసక్తి గల ఉత్పత్తిదారులు, అధీకృత డీలర్ల షార్ట్ టెండర్లు ద్వారా మెషీన్ సరఫరా కొరకు టెండరులో పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి గల బిడ్డర్లు ఇ.యం.డి మొత్తం రూ.2 లక్షలు జూలై 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపుగా డిమాండ్ డ్రాప్ట్ లేదా బ్యాంకర్స్ చెక్ ను సమర్పించాల్సి ఉందన్నారు. అదే రోజు సాయంత్రం 03:00 గంటలకు టెండర్లు తెరవబడతాయని, టెండరు డాక్యుమెంట్లను భీమవరం కలెక్టరేట్ కాంపౌండ్ లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయము నందు సమర్పించాల్సి ఉందన్నారు. టెండరు పొందిన నెల రోజుల లోపున మెషీన్ సరఫరా చేయవలసిన ఉంటుందన్నారు. టెండరు షెడ్యూలు, సాంకేతిక అవసరాలు, ఇతర సమాచారంకు తాడేపల్లిగూడెం పురుగు మందుల పరీక్ష లాబొరేటరి సహాయ వ్యవసాయ సంచాలకుల వారి కార్యాలయం నుండి జూలై 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 05:00 గంటల మద్య పొందవచ్చునని, ఏదైనా సందేహా నివృత్తికి ఈ సెల్ నెంబర్ నందు సంప్రదించాలని 8331056658 జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in