Read Time:5 Minute, 2 Second
TDP Manifesto:అమరావతి: ఏపీ ఎన్నికల కు తెదేపా-భాజపా-జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది.
ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు.
చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి మేనిఫెస్టో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ఇచ్చిన హామీలు తెలుసుకుందాం.
- మెగా డీఎస్సీ పై కూటమి మొదటి సంతకం.
- వృద్ధాప్య పింఛన్ రూ.4000 రూపాయలకు పెంచుతారు.
- దివ్యాంగుల పింఛన్ రూ.6000 పెంచుతారు.
- 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.15,00 ఇస్తారు.
5 అలాగే పండగ కానుకలు ఇస్తారు. - ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం.
- యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు.
- నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంతవరకు నెలకు రూ .3000 నిరుద్యోగ భృతి ఇస్తారు.
- అలాగే తల్లివందనం కింద ఎంత మంది బిడ్డలు ఉన్న ఏడాదికి ఒక్కో బిడ్డకు రూ 15,000 రూపాయలు అందజేస్తారు.
- ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయం అందజేస్తారు.
- వాలంటరీలకు గౌరవ వేతనం నెలకు ₹10, 000 అందజేస్తారు.
- అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
- పేదలు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ చేస్తారు.
- భూ హక్కు చట్టం రద్దు చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.
- ప్రతి ఇంటికి ఉచిత కులాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు అందజేస్తారు.
- బీసీలకు రక్షణ లేదని బీసీ రక్షణ చట్టం అమలు చేస్తారని హామీ ఇచ్చారు.
- పూర్ టు రీచ్ ద్వారా ప్రతి పేదవాడికి సంపన్నులు చేస్తామని అనే హామీ ఇవ్వడం జరిగింది.
- రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్లు ,మర మగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తారు.
- కరెంటు చార్జీలు పెరగమని హామీ ఇచ్చారు.
- బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ 4,000 రూపాయలు అందజేస్తారు.
- ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇళ్ల స్థలం అందజేస్తారు అని హామీ ఇచ్చారు.
- పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇల్లు నిర్మాణం చేసి అందజేస్తాము.అని హామీ ఇచ్చారు.
- పెళ్లి కానుక కింద రూ.లక్ష రూపాయలు అందజేస్తారు.అని హామీ ఇచ్చారు
- దేశ విదేశాలలో ఎవరైతే చదువుకుంటున్నారో, అటువంటి వారందరికీ విదేశీ విద్యను మళ్లీ తీసుకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
- పోలవరం ప్రాజెక్టు ,సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని టిడిపి జనసేన, బిజెపి కలిపి టోటల్ గా 25 హామీలను ఇచ్చారు.
- రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులను స్వయం సహాయక సంఘాలు మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ప్రతి గ్రూపుకి పది లక్షల వరకు ఎటువంటి వడ్డీ అంటూ లేకుండా రుణాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
- అలాగే పెన్షన్లకు సంబంధించి గడిచిన మూడు నెలలకు సంబంధించి ప్రతి నెలకు వెయ్యి రూపాయల చొప్పున అంటే ఏప్రిల్, మే,జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలలకు జూలై ఒకటో తేదీన జులై కి సంబంధించిన నాలుగు వేల పింఛన్ తో పాటు అదనంగా 3,000 రూపాయలను అందజేస్తారు.అంటే మొత్తం రూ .7,000 అందజేస్తామని హామీ ఇచ్చారు అలాగే పెన్షన్ దారులకు సంబంధించి ఎటువంటి కండిషన్లు ఉండవు అని కూడా హామీ ఇచ్చారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in