Teeth Pain: పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు పంటి నొప్పి అనేది మనిషిని చాలా బాగా బాధిస్తున్న సమస్య ఈ బాధ పడుకొనివ్వదు.కూర్చొనివ్వదు.
ఒక్కొక్కసారి సడెన్ గా లేదా నైట్ గాని ఈ పంటి నొప్పి వచ్చింది అనుకోండి. అప్పుడు ఇంట్లోనే బాధనుండి పరిష్కరించుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని వేసి దానిలో పావు స్పూన్ వాము, ఒక స్పూన్ సాల్ట్ వేసి రెండు నిమిషాలు మరిగించండి.ఇలా మరిగించిన నీటిని పుక్కిలించడం వల్ల సాల్ట్ ,వాము యాంటీబయాటిక్ లా పని చేసి తక్షణమే పంటి నొప్పి తగ్గుతుంది .
అలాగే పంటి పుచ్చి పై లవంగం పెడితే నొప్పి తగ్గుతుంది.అని చాలామంది పంటి పుచ్చి పై లవంగం పెడతారు.
కానీ అలా పెట్టడం వల్ల పుచ్చిపోయిన పంటిపై లవంగం గుచ్చుకొని మరింత బాధ పెడుతుంది.
కాబట్టి అలాంటి పని చేయొద్దు.దీని బదులు ఇంట్లో పారాసెట్మాల్ లేక డోలో 650 టాబ్లెట్స్ వంటివి ఇంట్లో ఉంటే అవి వేసుకోవడం వల్ల కూడా పెయిన్ నుండి రిలీఫ్ ఇస్తుంది.
అలాగే పంటి నొప్పి తగ్గడానికి ఇంకొక రెమిడి: దీనికి మనకు కావలసినవి నిమ్మకాయ ,ఇంగువ మాత్రమే ఒక పావు స్పూన్ ఇంగువ తీసుకొని దానిలో నిమ్మరసం చుక్కలను ఇంగువ కరిగేంతవరకు మాత్రమే వేసి బాగా మిక్స్ చేసి చిన్న దూది ముక్కను తీసుకుని ఇలా కలిపిన మిశ్రమంలో దూదిలో ముంచి నొప్పి వస్తున్న పంటిపై ఈ దూది ముక్కను ఉంచితే వెంటనే నొప్పి తగ్గుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in