Thati Munjalu:తాటి ముంజులు వల్ల లాభాలు తాటి ముంజలు తినడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
మండే ఎండల్లో ఈ తాటి ముంజులు తింటే ఆ మజానే వేరు. ఎండాకాలం వచ్చింది అంటే తాటి ముంజలు అందరికీ గుర్తొస్తాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి.
కనుక తాటి ముంజులు అందరికీ గుర్తుకు వస్తాయి. వీటిని ఐస్ ఆపిల్స్ అని, తాటి ముంజులని, ముంజ కాయలు అని, ముంజులు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.
దీనిని పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్లు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడి తింటారు. వేసవిలో దొరికే అరుదైన కాయ, మరియు వీటి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.
దీనిని పోషకాలు బాండాగారమని అంటారు. ఇది కల్తీ లేని స్వచ్ఛమైన ప్రకృతి పండు. ఇది శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన పండు. మండుటెండల్లో మంచి ఉపశమనం ఈ తాటి ముంజులు.
వీటిని ఈ సీజనల్ లో మిస్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే. వీటి రుచి లేత కొబ్బరికాయ వలే ఉంటుంది. పట్టుకుంటే జారే జల్లిలు లాగా ఉంటాయి. వీటి లోపలి భాగంలో నీరు తియ్యగా ఉంటాయి.
ఇవి ఎక్కువగా నీటి శాతం కలిగి ఉంటాయి. దీనివలన కడుపు నిండినట్టుగా ఉండి ఆకలి వేయదు. క్యాలరీస్ తక్కువగా, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివలన బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది.
దీనిలో విటమిన్ A,B,C,K,జింక్, ఐరన్, ఇనుము, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి. చికెన్ పాక్స్ తో బాధపడేవారు దీనిని తింటే శరీరం వేడి తగ్గి దురద మంట లాంటివి తగ్గుతాయి.
బాధ కూడా తగ్గుతుంది. ఇవి శరీరంలోని టాక్సిన్ లను బయటకు తొలగిస్తుంది. దీనిలో తక్కువ క్యాలరీలు మన శరీరానికి కావలసిన ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. తాటి ముంజులు తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అయ్యి గ్యాస్, ఎసిడిటీ లాంటివి లేకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, ఉదర సంబంధ సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి వేసవిలో మంచి పోషకాలు అందించే పండు. ఐస్ ఆపిల్స్ లో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ కాల్షియం, ఫైటో న్యుట్రియన్లు, విటమిన్లు ఉంటాయి.
ఇందులో విటమిన్ A,C,B7 పుష్కలంగా ఉన్నాయి. క్యాలరీలు పెంచకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు ఫైటో న్యూట్రియన్స్, ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి.
వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి ముఖం మెరిసేలా చేస్తుంది. దద్దుర్లు, చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.
దురద, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానుక తాటి ముంజులు టేస్ట్ కి కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in