Tips For Darkspots:ముఖంపై నల్ల మచ్చలు పోవాలా అందంగా కనిపించాలని ముఖం కి మేకప్ వేసుకుంటాం.
కానీ చర్మంపై అక్కడక్కడ నల్లని మచ్చలు ఉంటే మేకప్ సరిగ్గా ఉండదు. మరీ మచ్చని పోగొట్టాలంటే ఇంట్లోనే పలు చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటంటే
నిమ్మరసం
దీనిలో విటమిన్ సి ఉంటుంది. ఇది మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. రెండు స్పూన్ల నిమ్మరసంలో, కాటన్ క్లాత్ ముంచి మచ్చలపై ఐదు నిమిషాలు మర్దన చేసి నీటితో శుభ్రం చేసుకోవాలి.
మజ్జిగ
ఇందులోని లాప్టిక్ యాసిడ్ ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించి నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అరకప్పు మజ్జిగలో దూది ముంచి మచ్చలపై రాయాలి. ఓ పావుగంట ఆరనిచ్చి ఆపై నీళ్లతో కడిగితే సరి.
కలబంద
కలబంద రసాన్ని మచ్చలపై రాసి అరగంట తర్వాత శుభ్రం చేస్తే చాలు. ఇందులో ఉండే అలోఇన్ అనే కాంపౌండ్ వాటి రంగు మారుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
టమోటో
టమోటో గుజ్జు స్క్రీన్ టోనర్గా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు పోయి చర్మం మృదువుగా మారుతుంది.
బొప్పాయి
దీనిలోని ఖనిజాలు, మచ్చలను దూరం చేసి నిగారింపును అందిస్తాయి. పండిన బొప్పాయి గుంజును ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరి.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in