Ugadi Pachadi:ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది అనగానే షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం ఇవ్వగల మంగళకరమైనవి ఔషధ గుణములు కలిగిన వస్తువులు ఉన్నాయి
వేప పువ్వు తినటం వల్ల మన శరీరంలో కొన్ని క్రిములు వంటివి నశింపజేస్తుంది.
రెండోది బెల్లం అంటే మంగళకరమైనది. అసలు బెల్లం లేకుండా నైవేద్యం పెట్టరు. కొత్త బెల్లం వచ్చేది కూడా ఈ చైత్ర మాసంలోనే కనుక ఈ బెల్లాన్ని ఉపయోగిస్తారు.
మామిడికాయలు కాయడం కూడా ఈ చైత్ర మాసంలోనే అలాగే చింతపండు అరుగుదలకు జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మంగళకరమైన వాటితో ఉగాది పచ్చడి చేస్తారు కనుక ఈ ఉగాది పచ్చడి కి అంత ప్రాముఖ్యత ఉంది.
ఉగాది పచ్చడి తయారు చేసే విధానం :
దీనికి మనకు కావలసినవి బెల్లం, వేప పువ్వు, చింతపండు, మామిడికాయ, అరటి పళ్ళు, వేపిన శనగపప్పు,కొబ్బరికాయ మాత్రమే ముందుగా వేప పువ్వు మొగ్గలు లేకుండా వేప పువ్వు మాత్రం కాస్త ఒక గిన్నెలో తీసుకోండి. తర్వాత దానిలోకి తురిమిన బెల్లం తరువాత సన్నగా తురిమిన అరటి పళ్ళు, కొబ్బరి, మామిడికాయ , ముక్కలను, వేపిన శనగపప్పు చివరగా చింతపండు రసాన్ని వేసి బాగా చేతితో కలపండి. అంతే ఉగాది పచ్చడి రెడీ అయినట్లే.
ఉగాది పచ్చడి ఎలా ఐతై షడ్రుచులు ఉంటాయో అలాగే మానవ జీవితం కూడా ఒడుదుడుకుల సమ్మేళనం
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in