Usirikaya Pachadi:ఉసిరి గురించి మరియు ఉసిరి రోటి పచ్చడి మరియు ఉసిరి నిలవ పచ్చడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి మనకు ఎంతో మేలు చేస్తుంది ఈ ఉసిరి కాయల్లో చాలా ఔషధ గుణాలు పోషకాలు ఉంటాయి. ఉసిరి చెట్టు చాలా పురాతనమైనది. 100 గ్రాముల ఉసిరికాయలను తీసుకుంటే 600 మిల్లీగ్రాముల నుంచి 900 మిల్లి గ్రాముల వరకు విటమిన్ సి లభిస్తుంది.
నాచురల్ గా లభించే అన్ని ఆహారాలు కంటే ఎక్కువ విటమిన్ సి లభించే ఆహారం ఉసిరి అని మనకు తెలుసు. ఈ ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు మనిషికి చేసే మేలు అంతా ఇంతా కాదు కాబట్టి ఉసిరికాయలు లభించేటప్పుడు ఉపయోగించుకుంటే మంచిది.
ఉసిరికాయలను ముక్కలుగా కోసి ఎండబెట్టి సంవత్సరం పొడుగునా చప్పరిస్తూ ఉంటే మంచిది. అలాగే పొడిచేసి వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు తేనెతో ఉసిరిని కలిపి తినొచ్చు దీనివల్ల శరీరానికి చాలా మేలు చేస్తుంది.
సీజన్ లో దొరికే పెద్ద ఉసిరికాయలను రోటి పచ్చడి చేసుకునే తింటే పోషకాలు పోవు ఎందుకంటే ఈ ఉసిరికాయని ఉప్పులో ఊరబెడితే పోషకాలు పోతాయి కానీ రోటి పచ్చడి ద్వారా తింటే పోషకాలు అలానే ఉంటాయి రోటి పచ్చడికి జస్ట్ ఐదు నిమిషాలు వేడి చేస్తాము అంతే పచ్చి పోవడానికి మాత్రమే తరువాత గ్రైండ్ చేస్తాము.
కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన రక్షణ వ్యవస్థను పెంచే పెద్ద ఉసిరికాయల రోటి పచ్చడి ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం:
ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి నాలుగు స్పూన్ల వేరుశెనగ పప్పులను సిమ్ములో వేయించుకోండి. తరువాత వేరుశెనగపప్పు వేగిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకోండి.అలాగే ఉసిరికాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పచ్చి పోయేంతవరకు అంటే ఉసిరికాయలు ఉన్న నీరు పోయి ముక్క మెత్త పడేంత వరకు ఉడికించండి.
తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి మూడు స్పూన్ల నూనె వేసినూనె వేడి అయిన తరువాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిరపకాయలు వేసి బాగా వేగనీయండి.తరువాత స్టవ్ కట్టి వాటిని చల్లార్చిన తరువాత మిక్సీలో ఈ మిశ్రమాన్ని కాస్త పసుపును కూడా వేసి లైట్ గా మిక్సీ పట్టండి తరువాత వేయించిన వేరుశనగ గుళ్ళు ఉసిరికాయ ముక్కలను ఉప్పును వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
ఎప్పుడు రోటి పచ్చడి మెత్తగా చేయకూడదు.కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది.కొంతమంది తీపిగా తినాలి అనుకునేవారు చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోండి .రోటి పచ్చడి తాలింపుకి స్టవ్ పై గిన్నె పెట్టి ఒక స్పూన్ నూనె వేసి దానిలో అర స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, సాయి మినప్పప్పు, మూడు వెల్లుల్లి రెబ్బలు, ముక్కలుగా చేసిన ఒక మిరపకాయ, కాస్త కరివేపాకు చివరగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే సరి. అంతే వేడి వేడి రోటి పచ్చడి రెడీ అయినట్టే
ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసే విధానం మరియు తయారీకి కావల్సిన పదార్ధాలు: ఉసిరి పచ్చడి కి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు ఒక కేజీ, మెంతులు మూడు స్పూన్లు, జీలకర్ర మూడు స్పూన్లు, ఆవాలు మూడు స్పూన్లు, చింతపండు 100 గ్రాములు, ఉప్పు పసుపు, కారం తగినంత, వెల్లుల్లి నాలుగు , వేరుశెనగ నూనె 1/2 కేజీ.
తయారు చేసే విధానం: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టండి.తరువాత మందపాటి గిన్నెలో మూడు స్పూన్ల చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి ఒక గిన్నెలోకి తీయండి.తరువాత ఆ గిన్నెలో 1/2 కేజీ నూనె వేసి ఆరిన ఉసిరికాయలను వేసి బాగా వేయించండి.
ఉసిరికాయను నొక్కితే మెత్తబడేంత వరకు వేయించి తరువాత చల్లార్చనివ్వాలి. తరువాత వేయించిన మెంతులు ఆవాలు, జీలకర్రను మిక్సీ పట్టి మెత్తగా పొడిగా చేసి పక్కన పెట్టండి. చింతపండును నానబెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టండి. వెల్లుల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నూనెను వేసి దానిలో వేయించిన ఉసిరికాయలను, గ్రైండ్ చేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర మిశ్రమాన్ని, చింతపండు గుంజును వేసి, నాలుగు గరిటెల కారాన్ని, రెండు గరిటెల సాల్టును, ఒక స్పూన్ పసుపును, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపండి.అంతే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయినట్టే.ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in