Velairpadu:జూలై 19…. భారీ వర్షాలు, వరదలు నేపద్యంలో శుక్రవారం వేలేరుపాడు మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి పర్యటించారు. పెద్దవాగు ముంపుతో నిరాశ్రుయులైన అల్లూరినగర్ కుటుంబాలను పరామర్శించి పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు.
ముంపునీటికి గురైన ఇళ్లల్లో ఉండకుండా పునరావాస కేంద్రంలో తలదాచుకోవాలన్నారు. పునరావాస కేంధ్రాల్లో వారికి అవసరమైన ఆహారం, త్రాగునీరు, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న రెవిన్యూ అధికారులు గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలని తీసుకువెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లను చూడాలని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే గ్రామంలో వైద్యాధికారులు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపద్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు వారి గ్రామంలోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయాలని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ వెంట రెవిన్యూ, వైద్య, తదితర శాఖల అధికారులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in