Velairpadu: జూలై 19…. భారీ వర్షాలు, వరదలు నేపద్యంలో అధికారులను మరింత అపమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. శుక్రవారం
వేలేరుపాడులో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పాత్రికేయులతో మాట్లాడుతూ పెద్దవాగు వరద నీరు తగ్గినప్పటికి నీటితో ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు ఆహార పొట్లాలను అందించేందుకు శుక్రవారం మధ్యాహ్నం స్ధానిక తహశీల్దారు కార్యాలయంలో తయారు చేయించడం జరిగిందన్నారు. మూడు వేల ఆహార పొట్లాలు, త్రాగునీరు ఏర్పాటు చేశామన్నారు. బాధితులను రాత్రిపూట పునరావాస కేంద్రంలోనే ఉండమని తెలియజేశామని, అక్కడే ఆహార ఏర్పాట్లు చేస్తామన్నారు. పెద్దవాగు వరద మూలంగా దెబ్బతిన్న రహదారి మరమ్మత్తులు చేయవల్సివుందని, విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. తొమ్నిది నెలలు నిండిన గర్భిణీలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చేందుకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in