Velairpadu July 21: భారీ వర్షాలు, వరదలు కారణంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో త్రాగునీటి అవసరాలకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ ఆర్. సత్యనారాయణ తెలిపారు.
ఇటీవల ప్లాష్ ప్లడ్ ప్రభావితమైన 12 గ్రామాల్లో గత మూడు రోజులుగా 2 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశామని ఆలాగే 8 ట్యాంకుల ద్వారా రోజుకు 18 ట్రిప్పులు నీరు సరఫరా చేశామని తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మరో 14 నివాసిత ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయడంతోపాటు వేలేరుపాడు శివకాశీపురంలోని ఎస్టీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 50 వేలు వాటర్ ప్యాకెట్స్ తోపాటు ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేశామన్నారు. కుక్కునూరు మండలం దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ పునరావాస కేంద్రంలో ఇప్పటికే 5 బోర్లు పంపింగ్ చేశామని ఒక మోటారును కూడా ఏర్పాటు చేశామని, ఇక్కడ పునరావాస కేంద్రంలో 13 టెంపరరీ మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in