Velairpadu July 22:గోదావరి వరద బాధితులకు అన్ని విధాల అండగా ప్రభుత్వం ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. సోమవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పర్యటించారు.

లచ్చిగూడెం గ్రామ ప్రజలతో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ పునరావాస శిబిరానికి రావాలని, గొమ్ముగూడెం గ్రామ ప్రజలకు దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ 1, రేపాకగొమ్ము గ్రామ ప్రజలకు దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ సి బ్లాక్ నందు పునరావాసం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గొమ్ముగూడెం కు సంబంధించి 170 కుటుంబాలు చెందిన 520 మంది జనాభా ఉన్నారన్నారు. రేపాకగొమ్ము చెందిన 148 కుటుంబాలకు చెందిన 461 మంది ప్రజలు ఉన్నారన్నారు. అదే విధంగా కౌండిన్యముక్తి చెందిన వారిని మర్రిపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ పునరావాస కేంద్రానికి తరలించడం జరగుతుందన్నారు. ఇక్కడ 35 కటుంబాలకు చెందిన 118 మంది జనాభా ఉన్నారన్నారు. గొమ్ముగూడెం గ్రామస్ధుల కోసం దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వంట ఏర్పాట్లను పరిశీలించారు. వంటకు వినియోగిస్తున్న దినుసుల నాణ్యతను పరిశీలించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in