Vikasith Andhra:ఏలూరు, ఆగస్టు,16:2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా ఉండాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యంలో బాగంగా రానున్న ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
శుక్రవారం స్ధానిక కలెక్టర్ కార్యాలయ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్రా-2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29 పై జిల్లా అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జిల్లా కు చెందిన సమర్ధవంతమైన ప్రణాళికతో అధికారులు పని చేయాలన్నారు. నీతిఆయోగ్ సహాయ సహకారంతో నిర్థేశిత లక్ష్యాలను నిర్ణయించుకొని అన్ని ప్రాధమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు, సంవత్సర ప్రణాళికలను తయారు చేయడమైనదని తెలిపారు. అదే విధంగా 2047 నాటికి లక్ష్యాలను ఏర్పరచుకొని అధిక వృద్ధి రేటును లక్ష్యంగా ఏర్పరచుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు తయారుచేబడునని పేర్కొన్నారు. జిల్లాలో జిడిపిని వృద్ధి చేసుకునేందుకు వ్యవసాయ,ఉధ్యాన అనుబంధ, పారిశ్రామిక, పాలఉత్పత్తి, ఆక్వా, తదితర రంగాల ద్వారా మెండైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయా వ్యవసాయ ఉత్పత్తుల విస్తరణ, ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆక్వాకు సంబంధించి మరింత నాణ్యమైన ఉత్పత్తులు అందించగలిగే దిశగా రైతులను ప్రోత్సహిస్తే మరింత జిడిపి వృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమలకు సంబంధించి ముఖ్యంగా పెద్ద ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. మామిడి, కోకో, ఆయిల్ ఫామ్ పంటలకు నెలవుగావున్న జిల్లాలో అందుకు సంబంధించిన చాక్లెట్, తదితర పరిశ్రమలను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్ధితులు ఉన్న దృష్ట్యా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని చిన్నతరహా పరిశ్రమలను పెద్ద క్లస్టర్ గా అనుసంధానం చేసి వారికి అవసరమైన రుణ సౌకర్యాలు కల్పించే దిశగా అలోచనలు చేయాలన్నారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో మూడో స్ధానంలో ఉన్న జిల్లాను ప్రధమస్ధానంలో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందంచాలన్నారు ద్వారకాతిరుమల వంటి పుణ్యక్షేత్రాలు సందర్శించిన పర్యాటకులకు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో చూడదగిన అంశాలకు సంబంధించి ప్రత్యేక రూట్ మ్యాప్ ను రూపొందించాలన్నారు. ట్రైబల్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్య, ఆస్తుల నిర్వహణలో అందరికి సముచిత న్యాయం జరగాలన్నదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, గిడ్డంగుల నిర్వహణ, పునరుత్పాదక ఇందన వనరులు, వాణిజ్య పరంగా పర్యాటకాభివృధ్ది, వంటి నేపధ్య రంగాల్లో మండలాల భౌగోళిక, ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్ శాఖలు కలిసి పనిచేస్తే ఆయా రంగాల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. రాజధానికి సమీపంలోనే ఏలూరు జిల్లా కలిసివున్నందున పరిశ్రమలు, ఐటి రంగం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలన్నారు.
సమావేశంలో వికసిత్ ఆంధ్రా-2047 కు సంబంధించి 12 అంశాలకు సంబంధించిన జిల్లా ప్రాధాన్యతలపై సమీక్షించారు. అనంతరం క్షేత్రస్ధాయిలోజిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29 సంబంధించి తీసుకోవల్సిన అంశాలపై గణాంకశాఖ సహాయ గణాంక అధికారులకు వివరించారు.
ఈ వర్క్ షాప్ లో ఇన్ చార్జి సిపివో బి. శ్రీదేవి, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, డిపివో తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in